Illu illalu pillalu: శ్రీవల్లి చేసిన పనికి నర్మద, సాగర్ బుక్ అవుతారా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 198 లో.. భాగ్యం, శ్రీవల్లి మాట్లాడుకుంటారు. అమ్మడూ ఊరకే కంగారు పడకు.. బ్యాంక్లో బంగారం తాకట్టు పెట్టేటప్పుడు మాత్రమే ఒరిజినలా కాదా అని చెక్ చేస్తారు.. అంతే తప్ప దాచుకోవడానికి, లాకర్లో పెట్టేటప్పుడు కాదని శ్రీవల్లితో భాగ్యం అంటుంది భాగ్యం. బతికించావే అమ్మా.. ఎక్కడ మన బండారం భయపడి చచ్చానే అమ్మా అని శ్రీవల్లి అంటుంది. బ్యాంక్ వాళ్లు చెక్ చేయరు కదా అని అజాగ్రత్తగా ఉండకు.. వాటిని ఎవరైనా పరిశీలనగా చూస్తే అవి రోల్డ్ గోల్డ్ అని కనిపెట్టే ప్రమాదం ఉంది.. కాబట్టి వాటిని ఎవరూ చూడకుండా మూటగట్టి ఇచ్చేయ్ అని భాగ్యం అంటుంది. ఇంతలో వేదవతి పిలివడంతో.. సరేనమ్మా అంటూ నగల్ని మూటకట్టేస్తుంది శ్రీవల్లి.