English | Telugu

Karthika Deepam2 : సుమిత్ర నిర్ణయం విని జ్యోత్స్న షాక్.. వాళ్ళిద్దరిని కార్తీక్ ఒక్కటి చేస్తాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-514 లో.. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానని జ్యోత్స్న అంటుంది. అవసరం లేదు నువు కూడా ఆఫీస్ కి రా అని శ్రీధర్ అంటాడు. ఎందుకు మీకు అసిస్టెంట్ గానా అని జ్యోత్స్న అంటుంది. నేను మీకు అందరికి దూరంగా వెళ్ళిపోతానని జ్యోత్స్న అంటుంది. వెళ్ళిపోమని శివన్నారాయణ అంటాడు. నీ తొందరపాటు నిర్ణయం వల్లే పరిస్థితి ఇంత దూరం వచ్చిందని శివన్నారాయణ కోప్పడతాడు.

నాన్న దగ్గరికి వెళ్లి జ్యోత్స్న మానసిక స్థితి గురించి చెప్తూ సుమిత్ర బాధపడిందని దశరథ్ అంటాడు‌. అత్త నీ కూతురు సీఈఓగా ఉండాలి అంటే చెప్పు ఇప్పుడు తాతని ఒప్పిస్తానని కార్తీక్ అంటాడు. నాకు రెండు నిర్ణయాలు ఉండవు. నా కూతురికి పెళ్లి చేయాలి. నాతో ఉండాలి అంతే అని సుమిత్ర అంటుంది. విన్నావుగా అని జ్యోత్స్నపై శివన్నారాయణ కోప్పడతాడు.

రేపు వస్తున్నావ్ కదా మేనకోడలా అని జ్యోత్స్నకి చెప్పి శ్రీధర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కార్తీక్ శివన్నారాయణ మాట్లాడుకుంటారు. మీ నాన్నని సీఈఓ చేయడం.. మొత్తం నాదే నిర్ణయం ఎందుకో తెలుసా.. మీ అమ్మ ముందే అతన్ని కొట్టాను.. నా వల్ల వాళ్ళు విడిపోయారు.. మళ్ళీ ఒక్కటవ్వాలి.. అది నువ్వే చెయ్యలని కార్తీక్ తో శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్తాడు. నాన్న కి ఫోన్ చేసి విష్ చెయ్యొచ్చు కదా అన్నట్లుగా కాంచనతో కార్తీక్ అంటాడు. కాంచన టాపిక్ డైవర్ట్ చేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.