మీ పిల్లలకు ఎం చదువులు చెప్తారా అని భయంగా ఉంది
సర్కార్ సీజన్ 5 ఈ వారం ఎపిసోడ్ ఫుల్ ఫన్నీగా సాగింది. ఇందులో రకరకాల ప్రశ్నలు అడిగాడు. ఈ షోకి ఆరియానా, వర్షిణి, దేత్తడి హారికా, శ్రీసత్య వచ్చారు. వచ్చే ముందు సుధీర్ ని ఆటపట్టించారు. ఇక ఒక ప్రశ్న అడిగారు సుధీర్ ఇందులో. "లక్ష రూపాయల్లో ఎన్ని 500 నోట్లు ఉంటాయి " అని అడిగాడు. ఈ ప్రశ్నకు క్లూస్ కోసం అందరూ డబ్బులు బిడ్డింగ్ పెంచుతూ వెళ్తున్నారు. ఆరియానా ఆశాలు బిడ్ చేయకపోయేసరికి సుధీర్ అడిగాడు ఎందుకు బిడ్ చేయట్లేదని. దానికి ఆరియానా ఏంటి నువ్వు ? అని అడిగాడు. "మీరు లెక్కలు అడిగారు నేను లెక్కల్లో చాలా పూర్. నా పరువు పోతుందని భయం" అంది. "ఎప్పుడన్నా మనకు ఉన్నదాని గురించి పోయిద్దా అని ఆలోచించాలి" అని కౌంటర్ వేసాడు.