English | Telugu

Illu illalu pillalu : విశ్వ ట్రాప్ లో అమూల్య పడేలా శ్రీవల్లి చేస్తుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -315 లో.... శ్రీవల్లి దగ్గరికి ప్రేమ వచ్చినట్లు వార్నింగ్ ఇచ్చినట్లు ఉహించుకుంటుంది. ఆ తర్వాత నిజంగానే ప్రేమ వస్తుంది. ఏంటి అక్క భయపడుతున్నావని శ్రీవల్లిని ప్రేమ అడుగుతుంది‌. అదేం లేదు నేనెంత దైర్యంగా ఉన్నానని ఏదో కవర్ చేస్తూ.. అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ధీరజ్ క్యాబ్ నడుపుతూ ఒక ఆతన్ని క్యాబ్ ఎక్కించుకుంటాడు.

అతను కార్ లో ఉన్న డైరీ చదువుతాడు. అందులో తనని కష్టపడి చదివించి పోలీస్ ఆఫీసర్ చెయ్యాలని ఉంటుంది. అది చూసి ఎవరిని పోలీస్ చేద్దామని అనుకుంటున్నావని అతను ధీరజ్ ని అడుగుతాడు. నాకు ఉంది లెండి నా అందాల రాక్షసి భార్య అని ధీరజ్ చెప్తాడు. మీరు చాలా గ్రేట్..భార్య కోసం ఇంత కష్టపడుతున్నారని అతను అంటాడు. అతను ఒక దగ్గర దిగిపోతాడు. కార్ లో తన బ్యాగ్ మర్చిపోతాడు. మరొకవైపు శ్రీవల్లికి విశ్వ ఫోన్ చేసి.. రెండు రోజుల్లో అమూల్య నా ట్రాప్ లో పడిపోవాలని చెప్తాడు. దాంతో శ్రీవల్లికి ఇంకా టెన్షన్ మొదలవుతుంది.

ఆ తర్వాత పికెల్ బిజినెస్ చేస్తున్నామని మీ మావయ్య గారి దగ్గర డబ్బు తీసుకొవాలని శ్రీవల్లితో భాగ్యం చెప్తుంది. ముందు ఈ విషయం మీ అత్తకి చెప్దామని భాగ్యం అంటుంది. అదంతా నర్మద వింటుంది. భాగ్యం వాళ్ళు వేదవతి దగ్గరికి వెళ్లి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం.. డబ్బు కావాలని అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.