రాధ ఎవరనుకున్నావ్ కోహినూర్ వజ్రం..
"కుక్కు విత్ జాతి రత్నాలు" షో త్వరలో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు జడ్జెస్ గా అలనాటి అందాల నటి రాధ, మూవీస్ లో విలన్ రోల్స్ లో కనిపించే ఆశిష్ విద్యార్థి, వాహ్ చెఫ్ సంజయ్ తుమ్మ ఉండబోతున్నారు. ఇక షోలో వంటలు చేసి అలరించడానికి ఈటీవీ నటుడు ప్రభాకర్, ప్రియా, యష్మి, బాబా భాస్కర్, సుజిత, సుహాసిని, విజె సున్ని, అవినాష్, విష్ణుప్రియ, రీతూ చౌదరి, బాలు అలియాస్ విషుకాంత్ వంటి వాళ్లంతా రాబోతున్నారు. ఐతే రోజూ ఒక ప్రోమోని రిలీజ్ చేస్తూ వస్తోంది స్టార్ మా. రీసెంట్ గా ఒక ప్రోమోని రిలీజ్ చేశారు. రాధ సిగ్గు పడుతూ కూర్చుంటే ఆశిష్ విద్యార్థి డైలాగ్ వేశారు. "ప్రదీప్ ఎవరయ్యా చెప్పింది బ్రిటీషర్ లు కోహినూర్ వజ్రాన్ని తీసుకుపోయారని ..చూడు మన పక్కనే కూర్చుంది" అన్నారు.