నవంబర్ 20 నుంచి చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే - సీజన్ 5
ఆహా ఓటిటిలో ఇండియన్ ఐడల్ షో పూర్తయిపోయింది. ఇక ఇప్పుడు చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే - సీజన్ 5 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటి వరకు నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు కొత్త సీజన్ తో నవంబర్ 20 వ తేదీ రాత్రి 7 గంటల నుంచి ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించి ఒక చిన్న టీజర్ రిలీజ్ చేశారు. ఐతే అది కాస్తా బ్లర్ చేసి వేశారు. ఐతే అందులో ఎవరు ఉన్నారు అనే విషయం లైట్ కనిపిస్తూ ఉంది కానీ అసలు అందులో పార్టిసిపంట్స్ ఎవరన్నది ఇంకా పూర్తిగా తెలీదు. ఐతే మానస్, అఖిల్ సార్ధక, యాదమ్మ రాజు, కావ్యశ్రీ, ప్రేరణ, టేస్టీ తేజ, పంచ్ ప్రసాద్, యాష్మి ఉన్నట్టు కనిపిస్తోంది. ఆహా ఇన్స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ పెట్టింది.