English | Telugu

Eto Vellipoindi Manasu : ఆ నగలు వేసుకున్న రామలక్ష్మి.. ఇంకా డౌట్ గానే ఉంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -66 లో.. నా కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు.. వాళ్ళని ఎలాగైనా దగ్గర చెయ్యాలని సిరి అనుకొని రామలక్ష్మికి టిఫిన్ తీసుకొని వెళ్తుంది. గుడికి వెళ్తున్నాం కదా అంటు రామలక్ష్మికి సిరి గోరింటాకు పెడుతుంది. ఇప్పుడు అన్నయ్య నువు వదినకి టిఫిన్ తినిపించని చెప్పగానే సిరి మాట కాదనలేక రామలక్ష్మికి సీతాకాంత్ ప్రేమగా టిఫిన్ తినిపిస్తుంటాడు.

మరొకవైపు సీతాకాంత్ వాళ్ల అమ్మ నగలు శ్రీలత తీసుకొని రామలక్ష్మికి ఇవ్వాలనుకుంటుంది. ఎందుకని సందీప్ అడుగుతాడు. రామలక్ష్మి, సీతాకాంత్ లు పెళ్లి చేసుకున్నారో లేదో తెలియాలంటే.. ఇవి రామలక్ష్మికి ఇవ్వాలి. ఈ నగలు సీతాకాంత్ కి సెంట్ మెంట్ ఇవి రామలక్ష్మి తీసుకుంటుందో లేదో చూడాలని సందీప్ తో శ్రీలత అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్, పెద్దాయనలకి రామలక్ష్మి కాఫీ తీసుకొని వస్తుంటే.. మీ ఆవిడని చూడరా ఎంత లక్షణంగా ఉందోనని పెద్దాయన అంటాడు. అప్పుడే శ్రీలత.. రామలక్ష్మి, సీతాకాంత్ లని పిలుస్తుంది. ఈ నగలు సీత వాళ్ళ అమ్మవి.. ఈ ఇంటికి కోడలిగా, సీతకు భార్యగా ఈ నగలు నువ్వు వేసుకోవాలని శ్రీలత చెప్పగానే.. నాకు వద్దని రామలక్ష్మి చెప్తుంది. కానీ సీతాకాంత్ మాత్రం ఈ ఇంటి కోడలు అవి వేసుకోవాలని చెప్తాడు. ఆ తర్వాత నువ్వే నీ భార్య మెడలో వెయ్యి అని శ్రీలత అనగానే.. రామలక్ష్మి మెడలో సీతాకాంత్ నగలు వేస్తాడు.

ఆ తర్వాత నగలు తీసుకుంది కదా అని శ్రీలతతో సందీప్ అనగానే.. డౌట్ పడుతూనే తీసుకుందని శ్రీలత అంటుంది. ఆ తర్వాత నాకు నగలు ఇవ్వలేదని శ్రీవల్లి ఫీల్ అవుతుంటే.. నేను వాళ్ళు పెళ్లి చేసుకున్నారో లేదో ఆ విషయం తెలుసుకోవడానికి అలా చేసాను.. నువ్వు కూడ వాళ్ళపై ఒక కన్ను వేసి ఉంచమని శ్రీవల్లికి శ్రీలత చెప్తుంది. మరొకవైపు అసలు సిరి, ధనల పెళ్లి అవుతుందో లేదోనని రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. మీ చెల్లి కూడా టెన్షన్ పడుతుందని సీతాకాంత్ తో రామలక్ష్మి చెప్పగానే.. వెంటనే సిరి దగ్గరికి ఇద్దరు వెళ్తారు. ఎలాగైనా మీ పెళ్లి చేస్తాను నీకోసం ఏం చెయ్యడానికైనా రెడీ అని సిరికి సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.