English | Telugu

Krishna Mukunda Murari : నీకు సిగ్గుగా లేదారా.. ఇంట్లో నుండి కృష్ణ, మురారీలు ప్యాకప్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -438 లో.. సంగీత, రజినీలకు మీరా మాటిస్తుంది. మరోవైపు మురారి, కృష్ణ బయట నుంచి ఇంటికి వచ్చేసరికి.. ఆదర్శ్ మందు తాగుతుంటాడు. వీడు మారడా.. నేను మాట్లాడి వస్తాను కృష్ణ.. నువ్వు లోపలికి వెళ్లు.. నువ్వు ఉంటే.. వాడికి ఇగో తన్నుకొస్తుంది.. నువ్వు వెళ్లిపో అని‌కృష్ణకి చెప్పి ఆదర్శ్ దగ్గరకి వెళ్తాడు మురారి. అక్కడ ఆదర్శ్ తో మురారి చాలా ఎమోషనల్‌గా మాట్లాడతాడు.

రేయ్ మారవా నువ్వు? కనీసం పెద్దమ్మ గురించైనా ఆలోచించొచ్చు కదా అంటూ తిట్టేస్తాడు. దాంతో ఆదర్శ్ రెచ్చిపోతాడు. చేతిలోని గ్లాస్ పగలగొట్టి.. పైకి లేచి.. మురారీ మీద కోప్పడతాడు. నీకు కేవలం పెద్దమ్మేరా.. నాకు మా అమ్మ.. తను బాధపడితే నాకు బాధే.. కానీ నా జీవితం ఇలా కావడానికి కారణం నువ్వే.. కేవలం నువ్వే.. నువ్వు ఆ కృష్ణ కలిసి నా జీవితాన్ని ఇలా చేశారు. అయినా నీకు సిగ్గుగా లేదా.. నా ముందు తిరగడానికి సిగ్గు లేదు. నీ స్థానంలో నేను ఉంటే కచ్చితంగా ఇంట్లోంచే వెళ్లిపోయేవాడ్నిరా.. వింటున్నావా.. వెళ్లిపోయేవాడ్ని అంటు మురారిని అవమానిస్తాడు‌ ఆదర్శ్. అలా ఆదర్శ్, మురారీల గొడవను పైనుంచి భవాని చూసి బాధపడుతుంటే మీరా కూడా వస్తుంది. మీరా కూడా వాళ్ల రచ్చ విని.. మేడమ్ మీరు బాధపడకండి. వాళ్లిద్దరిని నేను కలుపుతాను. మీరు నాకెంతో చేశారు. నేను మీకు ఈ ఒక్కటి చేసి పెడతానంటూ ధైర్యం చెప్పి లోపలికి పంపేస్తుంది. వెంటనే అక్కడే విలన్‌లా పిట్టగోడకు ఆనుకుని.. తనలో తాను ఆలోచిస్తుంది. ఏది ఏమైనా ఆదర్శ్, మురారీలు ఇలా కొట్టుకోవడం నాకు మంచిది కాదు. ఆదర్శ్.. మురారీని హేట్ చేయడం తగ్గించాలంటే.. నేనే ఆదర్శ్ మనసు మార్చాలి. మురారీ గురించి మంచిగా చెప్పి, కృష్ణను ఆదర్శ్ ‌కి శత్రువుని చెయ్యాలని మీరా అనుకుంటుంది. ఆదర్శ్ మాటల్ని మురారి తలుచుకుంటూ బాధపడుతుంటే తనని కృష్ణ ఓదారుస్తుంది. ఏసీపీ సర్.. మొన్నటిదాకా ఆదర్శ్.. నేను తప్పు చేశాను అన్నాడు. ఇప్పుడు నేరమంతా మీ మీద వేస్తున్నాడు. దీనంతంటికీ కారణం మీరా అనిపిస్తోంది. మీరానే ఆదర్శ్ మనసు మారుస్తోంది. కావాలనే చేస్తుందేమో. నిజానికి మీరా ముకుంద ఫ్రెండ్ కాబట్టి తనకు మనతో పోల్చుకుంటే ముకుందే ఎక్కువ. అందుకే ఆదర్శ్ మనసు పొల్యూట్ చేస్తోంది ఏసీపీ సర్ అని కృష్ణ గట్టిగా చెప్తుంది. అవును.. నిజమే కావచ్చని మురారి అంటాడు. ఆదర్శ్ తాగి వస్తుంటే మీరా వచ్చి మాట్లాడుతుంది. కానీ ఆదర్శ్ ‌వద్దని చెప్తాడు. దాంతో మీరా తెలివిగా.. మీకు కొన్ని తెలుసు కొన్ని తెలియవు ఆదర్శ్ గారు.. ముకుంద నాకు అన్నీ చెప్పింది కాబట్టి నాకు అంతా తెలుసు. ముకుంద జీవితం అలా కావడానికి ప్రధాన కారణం కృష్ణే, మురారీ కాదు. మురారీకి, మీకు శత్రుత్వం ఉంటే.. అది కృష్ణకే లాభం అందుకే అలా నటిస్తోందని మీరా అంటుంది.

నువ్వు చెప్పేది నిజమా అని ఆదర్శ్ అనగా.. నిజం సర్, నిజానికి ముకుందను లూజర్ అంటు కృష్ణ తనకి చుక్కలు చూపించింది. మురారీ నా సొంతమంటూ గేలి చేసేది.. చాలా అవమానించేది అన్నీ నాకు ముకుంద చెప్పుకుని ఏడ్చేదంటూ కృష్ణ మీద చెడ్డగా, మురారీ గురించి మంచిగా లేనిపోనివన్నీ చెప్పేస్తుంది. దాంతో ఆదర్శ్ మనసులో కృష్ణ మీద పగ మొదలవుతుంది. మురారీ మీద జాలి మొదలవుతుంది. మరోవైపు కృష్ణని మురారీ బట్టలు సర్దుకోమంటాడు. వద్దు.. మీరా వల్ల ఆదర్శ్ మారాడు కాబట్టి ఒకసారి మీరాతో మాట్లాడదామని కృష్ణ చెప్తుంది. కానీ మురారీ వినడు. మురారీ, కృష్ణ ఇద్దరు బ్యాగ్ తీసుకుని బయలుదేర్తారు. అది చూసిన రేవతి ఆపుతుంది. ఆదర్శ్ అక్కడే కూర్చుని ఉంటాడు. మీరా షాక్ అవుతుంది. వెళ్లిపోతున్నాం.. మా ఇంటికి వెళ్లిపోతున్నాం. ఇక ఇది నా ఇల్లు కాదు.. పదా కృష్ణా అంటూ మురారీ వెళ్లిపోతుంటే.. ఆదర్శ్ మాత్రం కోపంగా కదలకుండా అలానే చూస్తుంటాడు. మధు, సుమలత అంతా కలిసి ఆగండి అంటు వారి వెంటపడతారు. మీరా మాత్రం.. నేను నీ కోసం వస్తే నువ్వు వెళ్లిపోవడమేంటీ మురారీ అంటూ మీరా తన మనసులో టెన్షన్ పడుతుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.