English | Telugu

Guppedantha Manasu : ఎందుకొచ్చావంటూ కొడుకు కాలర్ పట్టుకున్న తల్లి.. ఇదేం ట్విస్ట్ రా మామా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1043 లో.. అనుపమ ఇంట్లో నుండి లెటర్ రాసి వెళ్లిపోతుంటే.. అప్పుడే అనుపమ కార్ కి అడ్డంగా దేవయాని వస్తుంది. అనుపమ కార్ దిగి వచ్చి దేవయానితో మాట్లాడుతుంది. ఎక్కడికి వెళ్తున్నావ్? నిన్ను ఫాలో అవుతూ వస్తున్నానని దేవయాని అనగానే.. నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారని అనుపమ అడుగుతుంది. అంటే నేను నిన్ను ఓదార్చడానికి వచ్చాను.. అయిన ఎందుకు వెళ్ళిపోతున్నావని అనుపమని మళ్ళీ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నీకు నీ భర్త కి గానీ ఏదైనా సమస్యలు ఉంటే చెప్పు.. నేను సాల్వ్ చేస్తానని దేవయాని అంటుంది.

ఆ తర్వాత అసలు నీకు పెళ్లి అయిందా.. అయితే ఎవరు నీ భర్త? మను తండ్రి ఎవరో చెప్పు? నిజం గానే మను నీ కన్నా కొడుకా లేక పెంచుకుంటున్నావా అని అనుపమని దేవయాని అడుగుతుంది. అసలు నన్ను ప్రశ్నించే హక్కు నీకు ఎక్కడిది? నువు ఎవరని అనుపమ అడుగుతుంది. అంటే ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పారిపోతున్నావా.. నువ్వు ఇలా చేస్తావనుకులేదని దేవయాని అంటుంది. మీరు హద్దుదాటి మాట్లాడుతున్నారని అనుపమ అంటుంది. ఏదైనా తప్పు చేసావా అని దేవాయని అనగానే.. అప్పుడే మహేంద్ర, వసుధార, మనులు అక్కడికి వస్తారు. అసలు మీరు ఎందుకు వచ్చారని దేవయానిని మహేంద్ర అడుగుతాడు. నేనేం అంటున్నా.. నన్ను ఈ విషయంలో అపార్థం చేసుకుంటున్నావ్.. మను తన తండ్రి విషయంలో చాలా బాధపడుతున్నాడని దేవాయని అంటుంది. " మీరు ఆపండి.. సూటి పోటీమాటలతో ఏంటిక్కడ నుండి మర్యాదగా వెళ్ళండి. లేదంటే ఫణింద్ర సర్ కి ఫోన్ చేస్తాను " అని వసుధార అనగానే.. దేవయాని అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత ఎందుకిలా చేస్తున్నావ్ ఎందుకు వెళ్లిపోదామనుకుంటున్నావని మహేంద్ర అంటాడు. " నువ్వు అసలు ఎందుకు వచ్చావ్" అని మనుని కాలర్ పట్టుకొని అడుగుతుంది అనుపమ. ఎవరైనా ఇలా అంటారా అని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత మీ ప్రశ్నలు వేధించేలా ఉన్నాయి.. మీరు ఇక అడగకండి అని మను అంటాడు. ఆ తర్వాత ఇక మేమ్ మిమ్మల్ని ఏం అడగమని చెప్పి.. అనుపమని ఇంటికి తీసుకొని వెళ్తారు. మరొకవైపు అసలు నా మాటలకి అన్ని ఎదురు మాట్లాడారని శైలేంద్రతో దేవయాని చెప్తుంది. ఆ తర్వాత ధరణి వచ్చి.. మీకు DRS అని బాగుందా? DSR బాగుందా అని అడిగారు కదా.. DRS బాగుందని ధరణి చెప్తుంది. ఎందుకురా పేరు విషయంలోనే ఇలా చేస్తున్నావంటు శైలేంద్రతో దేవయాని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.