English | Telugu

Krishna Mukunda Murari : నా కూతురు బ్రతికే ఉంది.. ముకుందకి పిండప్రదానం చేసిన శ్రీనివాస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -436 లో.. ముకుంద చనిపోయి పదకొండు రోజులైంది కదా‌.‌ పెద్దకర్మ చెయ్యాలి కదా.. అది జరిపించేస్తే ఆత్మశాంతి జరుగుతుంది కదా అక్కా? పంతులుగారికి చెప్పమంటారా? అని భవానీతో రేవతి అంటుంది. సరే చేయిద్దాం, కానీ ఆ శ్రీనివాస్‌ని కూడా పిలవండి అని భవాని అంటుంది. అక్కడ మీరా, ఆదర్శ్, రజినీ, సంగీత తప్ప అంతా ఉంటారు. అదేంటి పెద్దమ్మా.. శ్రీనివాస్ ఎంత కుట్ర చేశాడో మరిచిపోయావా? మన మురారీ ప్రాణాలే తియ్యాలని అరెస్ట్ చేయించాడు మరిచిపోయవా? అని మధు అంటాడు. అతడి బుద్ధి అతడు చూపించాడు.. మన సంస్కారం మనం చూపిద్దాం.. అయినా ముకుంద బతికి ఉన్నప్పుడే శ్రీనివాస్‌‌కి, ఈ ఇంటికి పెద్ద సంబంధాలు ఉండేవి కావు కదా.. ఈ ఒక్క పెద్దకర్మ చేయించేస్తే పూర్తిగా సంబంధాలు తెగిపోతాయని భవాని అంటుంది. సరే అక్కా శ్రీనివాస్ అన్నయ్యకు కాల్ చేసి చెబుతానని రేవతి చెప్తుంది.

ఇక అంతా కలిసి మరునాడు ఉదయాన్నే ఆ కార్యక్రమానికి వెళ్ళగా కాసేపటికి పంతులు వస్తాడు. పూజ మొదలవుతుంది. ఇంతలో శ్రీనివాస్ వస్తాడు. మురారీని అరెస్ట్ చేయించినందుకు తిట్టడానికి నన్ను పిలిశారా అని శ్రీనివాస్ అడుగుతాడు‌. ఇక భవానీ దేవి, రేవతి, మధు కూడా శ్రీనివాస్‌ కి సర్దిచెప్పాలని ప్రయత్నిస్తారు. ఇక అక్కడే ఉన్న మీరా.. అయ్యో నాన్నా వీళ్లు నిన్ను పిలిచింది. గొడవ పడటానికి కాదు. నాకు పెద్దకర్మ చేయడానికి అని తన మనసులో అనుకుంటు కంగారుపడుతుంది. అన్నయ్యా ముకుందకు పెద్దకర్మ చేయడానికి పిలిచాం.. వెళ్లి కూర్చోండి.. పిండప్రదానం చెయ్యాలి కదా అని శ్రీనివాస్ తో అంటుంది. దాంతో శ్రీనివాస్ తండ్రి మనసు అల్లాడిపోతుంది. నేను కూర్చోను.. నా వల్ల కాదు.. అయిన నా కూతురు ముకుంద చనిపోలేదు. తను బతికే ఉంది అంటూ ఆవేశంగా శ్రీనివాస్ అరుస్తాడు. దాంతో మీరాతో పాటు అంతా షాక్ అయ్యి శ్రీనివాస్ వైపు చూస్తుంటారు. వెంటనే మీరా.. అవును ముకుంద చనిపోలేదు. మన మధ్యే ఉంది. తన రూపంలో కంటికి కనిపించేలా లేదంతే అంటూ కవర్ చేస్తుంది. వెంటనే శ్రీనివాస్ మాములవుతాడు. ఇక మీరా శ్రీనివాస్ దగ్గరికి మీరా వెళ్ళి.. ఆ రెండు ముద్దలు పెట్టేసి వెళ్ళండి అని గట్టిగా చెప్పడంతో .. శ్రీనివాస్ పిండప్రధానం చేస్తాడు.

మీరా భాదపడుతున్నట్టు నటిస్తుండగా శ్రీనివాస్ చూసి.. ఊరుకోమ్మా మీరా.. నా కూతురు, నువ్వు ఇద్దరు కలిసి పెరిగారు. అంత గొప్ప స్నేహం మీది.. నేను కూడా ఇక నుంచి నీలోనే నా బిడ్డ ముకుందను చూసుకుంటానని అంటాడు. అది విన్న మీరా.. వావ్ నాన్నా.. మీరాలోనే ముకుందను చూసుకుంటారా? సూపర్ ఉంది ఇది.. ఈ ఐడియాను ఎలా వాడుకుంటానో చూడండి అని మనసులోనే పొంగిపోతుంది. ఇక ఇంట్లో ఉన్న ఆదర్శ్.. ముకుంద ఫొటోకి ఉన్న దండను తీసేసి.. ముకుంద ఫొటోని కూడా తీసేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.