English | Telugu

ముమైత్ ఫ్యూచర్ బ్యూటిషియన్స్  అకాడమీ త్వరలో

ముమైత్ ఖాన్ అంటే చాలు ఐటమ్ సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గానే ఎవరికైనా గుర్తొస్తుంది.  బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్‌గా అల్లాడించింది ముమైత్ ఖాన్.. అమ్మ తమిళనాడు.. నాన్న పాకిస్థాన్ .. దాంతో ముమైత్ మిక్స్డ్ బ్రీడ్ బేబీగా మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో చేసి ఆడియన్స్ లో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకుంది. అలాంటి ముమైత్  చాలా ఏళ్లుగా బయట ఎక్కడా కనిపించడంలేదు. షోస్ లో మూవీస్ లో కూడా కనిపించడం లేదు.  జీ తెలుగులో ‘డాన్స్ ప్లస్’ జడ్జీగా చేసాక ఆమె ఎవరికీ కనిపించలేదు. ఐతే ఇప్పుడు రీసెంట్ గా ముమైతే తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ ని పెట్టింది. త్వరలో ఒక అకాడమీని స్టార్ట్ చేయబోతోంది.

Brahamamudi : నేనే తప్పు చేయలేదంటూ భార్య రిక్వెస్ట్.. అతను అంగీకరిస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -535 లో.....అందరి గురించి బానే ఆలోచిస్తావ్ కానీ నీ కొడుకేం చేస్తున్నాడో పట్టించుకుంటున్నావా అని అపర్ణ అనగానే.. ఏం చేసాడు అంటీ అని స్వప్న అడుగుతుంది. ఎవరో అమ్మాయిని తీసుకొని షికారు చేస్తున్నాడని అనగానే రాహుల్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత బాగా చూసుకోమంటూ అపర్ణ, ఇందిరాదేవి లోపలికి వెళ్తారు. పద రాహుల్ గదిలోకి అని స్వప్న అంటుంది. నేను రానని రాహుల్ అనగానే.. అయితే ముసుగు వేసుకొని మరి కొడుతానని స్వప్న అనగానే.. అంటే నిన్న నైట్ కొట్టింది నువ్వేనా అని రుద్రాణి అంటుంది.