English | Telugu

పృథ్వీ కోసం విష్ణుప్రియ నామినేషన్.. ప్రేరణని బలిచేసిందిగా!

బిగ్ బాస్ సీజన్-8 లో సోమవారం నామినేషన్ల‌ ప్రక్రియ మొదలైంది. ఎనిమిదో వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేషన్ అవుతారో డిసైడ్ చేయండి అంటు ప్రతీ సీజన్ లో ఉండే కుండ పగులగొట్టే ప్రక్రియని ఇచ్చాడు బిగ్ బాస్.

నామినేషన్స్ ప్రక్రియ విష్ణుప్రియతో మొదలైంది. ఫస్ట్ నామినేషన్ ప్రేరణకి వేసింది విష్ణుప్రియ. నువ్వు నీకు ఇచ్చిన కిల్లర్ గర్ల్ పవర్‌ను దుర్వినియోగం చేసుకున్నావ్.. సరైన వ్యక్తిని నువ్వు నామినేట్ చేయలేదు (ఇండైరెక్ట్‌గా పృథ్వీని నామినేట్ చేసినందుకు).. వీకెండ్ రివ్యూలో కూడా అదే చెప్పారు.. ఇక ఫుడ్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా.. కానీ నువ్వు ప్రతిదీ అంత కాలిక్యులేటెడ్‌గా ఉండటం నాకు నచ్చలేదు.. ఒక ఫ్యామిలీలో ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారంటూ విష్ణుప్రియ చెప్పింది. నువ్వు పెద్దపెద్ద పదాలు వాడకు విష్ణు.. ఇక్కడ ఎవరికీ అమ్మానాన్న తమ్ముడు అలా ఫ్యామిలీలా ఏం లేదు.. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎందుకు తినాలి.. అందరికీ సేమ్ టాస్క్, సేమ్ ఎనర్జీ ఉంటుంది..కనుక ఒకలానే తినాలి అంటూ ప్రేరణ చెప్పింది. దీనికి నువ్వు చిరాగ్గా ఫేస్ పెడతావ్.. అది నాకు నచ్చదు.. అంటూ విష్ణు చెప్పింది. అలానే నాగార్జున సార్ చెప్పినా కూడా నీ తప్పు యాక్సెప్ట్ చేయవ్ అంటూ విష్ణు వాదించింది.అవును చేయను.. నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఉంది .. అది తగ్గించుకుంటున్నా.. అంటూ ప్రేరణ అంది.

విష్ణుప్రియ తన రెండో నామినేషన్ గా నిఖిల్‌ ని చేసింది. నువ్వు చీఫ్ నుంచి దిగిపోయాకా నీలో ఫైర్ పోయింది.. నీ సిగరెట్ అలవాటు వల్ల ఛార్జింగ్ టాస్కులో పాయింట్ పోయిందంటూ విష్ణుప్రియ అంది. దీనికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు నిఖిల్. అప్పుడు నేన చీఫ్ అందుకే అలా ఉన్నా.. నేను చీఫ్ కానప్పుడు నేను లీడర్ షిప్ చూపిస్తే అందరు ఊరుకుంటారా.. ఇక లైటర్ విషయానికొస్తే నేను ఫుడ్ కూడా త్యాగం చేసి ఉన్నా.. అలానే మిగిలిన వాళ్లు కూడా ఉన్నారు.. మరి నువ్వు బ్రేక్ ఫాస్ట్ చేశావ్ కదా.. దానికి పాయింట్లు పోయాయ్‌ కదా అని నిఖిల్ అనగానే.. విష్ణుప్రియ మొహం వాడపోయింది. ఇక కవర్ చేసుకోడానికి నీ నోటిదూల కారణంగా నామినేట్ చేస్తున్నానంటు విష్ణుప్రియ అంది. అయితే ఇక్కడ విష్ణుప్రియకి ఎవరిని నామినేట్ చేయాలో క్లారిటీ లేదు. కానీ పృథ్వీని నామినేట్ చేసిన ప్రేరణని నామినేట్ చేసింది. ఆ తర్వాత నిఖిల్ ని నామినేట్ చేస్తే ఏం అనుకోడు.‌ అదే ఇంకెవ్వరిని నామినేట్ చేసిన విష్ణుప్రియ డిఫెండ్ చేసుకోలేదు‌ అందుకే చెత్త రీజన్స్ తో వారిద్దరిని నామినేట్ చేసింది. రోజు రోజుకి పృథ్వీకి సర్వెంట్ లా మారిపోతున్న విష్ణుప్రియ ఓటింగ్ గ్రాఫ్ పడిపోతుంది. హౌస్ లోకి వచ్చి ఎనిమిది వారాలు అవుతున్న ఒక్క గేమ్ లో యాక్టివ్ పర్ఫామెన్స్ లేదు.. ఎప్పుడు చూసిన పృథ్వీ వెనకాలే తిరుగుతూ వరెస్ట్ కంటెస్టెంట్ అనిపించుకుంటుంది విష్ణుప్రియ.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.