English | Telugu

Karthika Deepam2 : శౌర్యకి సీరియస్.. కార్తీక్ కాపాడగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. (karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -176 లో.. దీపని జ్యోత్స్న అందరి ముందు తిడుతుంది. నువ్వు నన్ను నా బావని విడదియ్యడం కోసమే ఇక్కడికి వచ్చావ్.. నా బావ కోసమే ఈ ఇంట్లో ఉంటున్నావని దీప గురించి తప్పుగా మాట్లాడుతుంటే దీప జ్యోత్స్న చెంపపగులగొడుతుంది. నన్నే కొడుతావా అని జ్యోత్స్న అనగానే.. కొట్టడం కాదు చెప్పుతో కొట్టాలని దీప అంటుంది. అసలు నీకేం కావాలి.. ఏం చేస్తే ఇలాంటివి మాట్లాడవని దీప అనగానే.. నువ్వు మా ఇంట్లో నుండి వెళ్ళిపోమని జ్యోత్స్న అంటుంది. దాంతో సరే అంటూ దీప కోపంగా ఇంటికి వెళ్తుంది.

Eto Vellipoyindhi Manasu : దగ్గరికి తీసుకోవాలనుకున్న భర్త.. వద్దని పొమ్మన్న భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -227 లో.... సీతాకాంత్ దగ్గరికి కలిసి భోజనం చెయ్యాలని నందిని వస్తుంది. దానికి సీతాకాంత్ కూడా సరేనంటాడు.. ఇద్దరు కలిసి భోజనం చేస్తుంటారు. పెళ్లి అయి ఇన్ని రోజులు అవుతుంది. శుభవార్త ఏమైనా చెప్పేది ఉందా లేదా.. మీరు నాకు ఒక పాపనో బాబూనో ఇస్తే వాళ్ళతో ఆడుకుంటాను. నాకు ఎటు ఎవరు లేరు కదా.. వాళ్ళతో అయిన నా బాధ తిరిపోతుందంటూ మనసులో కుళ్ళు పెట్టుకొని నందిని మాట్లాడుతుంది. నీ కోసం రామలక్ష్మి ఎంత చేస్తుంది. నువ్వు తనకోసం టైమ్ స్పెండ్ చెయ్ అని సీతాకాంత్ తో నందిని చెప్తుంది. నిజమే రామలక్ష్మి నాకోసం చాలా చేసింది. తనకి తెలియకుండా ఈ రోజు బయటకు తీసుకొని వెళ్ళాలని సీతాకాంత్ అనుకుంటాడు.

Brahmamudi : అత్తకి క్యాన్సర్ లేదని తెలుసుకున్న అల్లుడు.. ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -541 లో.....అప్పు, కళ్యాణ్ లు ఇంటికి రాగానే ధాన్యలక్ష్మి వెళ్లి మాట్లాడుతుంది. అప్పుడు కూడా అప్పుని తప్పు పడుతుంది. నువ్వు ఇలా చేస్తే నేను వెళ్ళిపోతానంటూ  ధాన్యలక్ష్మి తో కళ్యాణ్ అంటాడు. మా అమ్మ గురించి తెలుసు కదా తన మాటలేం పట్టించుకోకని కళ్యాణ్ అప్పుతో అనగానే.. ఒక కొడుకు దూరం అయితే తల్లిగా ఎంత బాధపడుతుందో అర్థం చేసుకొగలను కానీ నేను ఆలోచిస్తుంది మా అమ్మ ఉన్నట్టుండి ఇంత గ్రాంఢ్ గా పెళ్లి రోజు ఎందుకు చేసుకుంటుందని అప్పు అంటుంది.

Brahmamudi : రాజ్ కి నిజం తెలిసేలా చేసిన అపర్ణ.. భార్యని ఎత్తుకున్నాడుగా!

స్టార్ మా టీవీలో ప్రసారవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -540 లో.....ఇందిరాదేవి, అపర్ణలు కనకం ఇంట్లో వంట చేస్తుంటే.. అప్పుడే కనకం వచ్చి‌‌.. మీరేంటి వంట చేస్తున్నారు. మీకేం కావాలో చెప్పండి అని కనకం అంటుంది. నువ్వు క్యాన్సర్ అని యాక్టింగ్ చేస్తున్నావ్ మర్చిపోయావా అని అపర్ణ అంటుంది. అవును కదా అని మళ్ళీ దగ్గుతు ఉంటుంది. నీ యాక్టింగ్ మీ అల్లుడు ముందు చూపించమని అపర్ణ అనగానే.. అల్లుడు గారిని నమ్మిస్తానని కనకం అంటుంది. ఆ తర్వాత కనకం రెడ్ కలర్ బాటిల్ కోసం వెతుకుంటూ ఉంటే.. అప్పుడే రాజ్ వచ్చి అత్తయ్య గారు వచ్చి మిమ్మల్ని ఒకటి అడగాలని అంటాడు.

Eto Vellipoyindhi Manasu : అటు అత్త ప్లాన్.. ఇటు భర్త మాజీ లవర్ కొత్త స్కెచ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -226 లో... సీతాకాంత్ ముందు నందిని నటిస్తుంది. ఇక నిన్ను బాధపెట్టనని నందిని వెళ్లిపోతుంటే సీతాకాంత్ త‌న చెయ్యి పట్టుకొని ఆపుతాడు. నువ్వు ఎక్కడికి వెళ్లనవసరం లేదు.. ఇక్కడే ఉండు కలిసి వర్క్ చేద్దాం.. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను.. ఇక మనం బిసినెస్ పార్టనర్స్ కాకుండా మంచి ఫ్రెండ్స్ కూడా అని సీతాకాంత్ అనగానే.. వద్దు సీతా మళ్ళీ ఏదైనా జరిగితే నన్ను అనుమానిస్తావని నందిని అంటుంది. అలాంటిదేం లేదని సీతాకాంత్ అంటాడు. దాంతో ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు.

Karthika Deepam2 : కార్తీక దీపంలో కొత్త హీరో.. దీపని తిట్టేసిన జ్యోత్స్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -175 లో... కాంచన, కార్తీక్‌ల ముందు జ్యోత్స్న.. తాళి పట్టుకుని నిలబడుతుంది. ఇప్పుడే ఈ క్షణమే తాళి కడతావా లేక.. చావమంటావా అంటు  జ్యోత్స్న విషం బాటిల్ తియ్యడంతో.. బిత్తరపోతారు తల్లీకొడుకులు. ఈ క్రమంలోనే.. జ్యోత్స్న ఏంటి ఈ పిచ్చి పని అంటూ కాంచన.. కార్తీక్ తిడుతున్నా.. జ్యోత్స్న మాత్రం విషం బాటిల్ ఒక చేతిలో.. తాళి బొట్ట మరో చేతిలో పట్టుకుని.. రెచ్చిపోతుంది. దాంతో కార్తీక్ నచ్చజెప్పలనే.. ఇటు ఇవ్వు తాళి.. కడతానని అందుకుంటున్నట్లుగా జ్యోత్స్న దగ్గరకు వెళ్తాడు.