English | Telugu
నామినేషన్ లో పృథ్వీ, రోహిణి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్.. విష్ణుప్రియ సిల్లీ రీజన్!
Updated : Oct 21, 2024
బిగ్ బాస్ సీజన్-8 తెలుగు రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో అటు బిగ్ బాస్ కి ఇటు ఆడియన్స్ కి షాకిచ్చాడు మణికంఠ. ఇక ఎనిమిదో వారం నామినేషన్లకి సంబంధించిన ప్రోమో రానే వచ్చింది.
హౌస్ లో వారమంతా ఒక ఎత్తు.. నామినేషన్లు ఒక ఎత్తు.. ఎందుకంటే వారమంతా ఎవరేం చేసారో చూస్తూ.. ప్రతీ ఒక్క కంటెస్టెంట్ తమ అభిప్రాయాలని చెప్తూ హౌస్ నుండి ఒకరిని బయటకు పంపడానికి నామినేషన్ చేస్తుంటారు. అలా ఈ వారం నామినేషన్ల ప్రక్రియ జరిగింది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. అసలు ఇందులో ఏం ఉందో ఓసారి చూసేద్దాం.. మణికంఠ విషయంలో నువ్వు అసలు మెహబూబ్ కి పాయింట్ ఇవ్వకుండా ఉండాల్సిందంటూ నిఖిల్ ని నామినేట్ చేసింది విష్ణుప్రియ. మరి నువ్వు బ్రేక్ ఫాస్ట్ చేశావ్ కదా అని నిఖిల్ అనగా.. జస్ట్ వన్ పాయింటే ఇచ్చానని విష్ణుప్రియ అంది. నేను కూడా వన్ పాయింటే ఇచ్చానంటు నిఖిల్ డిఫెండ్ చేసుకున్నాడు. చెప్పిన రూల్స్ అసలు వినడం లేదు.. చాలా సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నావని పృథ్వీని రోహిణి నామినేట్ చేసింది. నా అపోజిట్ టీమ్ నువ్వు నీ రూల్స్ నేనెందుకు ఫాలో అవ్వాలని పృథ్వీ డిఫెండ్ చేసుకున్నాడు. కేబుల్స్ ఇవ్వగానే అలా దాచుకుంటే ఎలా అని రోహిణి అనగా.. అది నా స్ట్రాటజీ అని పృథ్వీ అంటాడు. అసలు గేమ్ ఆడకుండా స్ట్రాటజీ ఏంటని రోహిణి అంది. ఫుడ్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్.. అల్రెడీ నీకు నాకు ఫుడ్ మీద వచ్చిందని ప్రేరణని విష్ణుప్రియ నామినేట్ చేసింది. ఫస్ట్ నువ్వు పెద్ద పెద్ద పదాలు వాడకు. ఇక్కడ పెద్దగా ఎవరు లేరు.. అమ్మ, నాన్న, అక్క అంటు ఎవరు లేరు.. అందరం ఈక్వల్ గా ఉన్నామని విష్ణుప్రియతో ప్రేరణ అంది.
గేమ్ లో నీ ఎఫర్ట్ కనపడట్లేదని రోహిణితో పృథ్వీ అనగానే.. గేమ్ లో ఎఫర్ట్ లేదా అని రోహిణి అనగానే.. ఉందని పృథ్వీ అన్నాడు. మరి ఇంకేం కావాలంటూ రోహిణి అంది. పృథ్వీ, రోహిణి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగినట్టుగా ఉన్నాయి. ఇక మధ్యలో రోహిణిని పృథ్వీ కించపరిచేలా చూసినట్టుగా ఉంది. దాంతో తను రెచ్చిపోయింది. ఆ చూపేంటి.. నువ్వు నన్ను చూసిన విధానం.. దట్ ఈజ్ నాట్ రైట్ అంటు పృథ్వీతో రోహిణి వాదించింది. ఇక వీరిద్దరి నామినేషన్ ఈ వారం హైలైట్ గా నిలిచేలా ఉంది. యూట్యూబ్ లో ఉన్న ప్రోమో ఇప్పటికే అత్యధిక వీక్షకాధరణ పొందింది.