English | Telugu

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి ప్రేమ తెలిసిపోయింది.. రివర్స్ డ్రామా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -223 లో.....సందీప్, శ్రీలతలు రౌడీ తో ఉన్న ఫోటోలని నందిని వాళ్లకు పంపిస్తుంది. అది చూసి శ్రీలత, సందీప్ లు షాక్ అవుతారు అప్పుడే నందిని ఫోన్ చేసి.. మీరు ఇద్దరు ఇక్కడికి రావాలి లేదంటే ఆ ఫోటోలు సీతాకాంత్ కి పంపిస్తానని చెప్తుంది. దాంతో కంగారుగా శ్రీలత, సందీప్ లు నందిని దగ్గరికి వెళ్తారు. మీరూ చూపించే సవతి ప్రేమ నాకెలా తెలుసనుకుంటున్నారా అని నందిని అంటుంది. రామలక్ష్మి అడ్డు తొలగించి ఆస్తులు సొంతం చేసుకోవాలని చూస్తున్నారని నాకు తెలుసు అని నందిని అంటుంది. అప్పుడే సందీప్, శ్రీలతలు గోడకి సీతాకాంత్, నందినిలున్నా ఫోటోని చూసి రివర్స్ డ్రామ ప్లే చేస్తుంటారు.

Brahmamudi : అత్తకి క్యాన్సర్.. అల్లుడు ఆ పని చేయగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -536 లో.. కావ్య అగ్రిమెంట్ తీసుకొని కనకం రావడానికి లేబర్ ఆఫీసర్ గా కావ్య బాస్ దగ్గరికి వెళ్తుంది. కావ్య అగ్రిమెంట్ తీసుకుంటుంది.‌ అప్పుడే అనామిక వచ్చి కనకం పిన్ని.. మర్యాదగా ఆ అగ్రిమెంట్ పేపర్ ఇవ్వు.. లేదంటే సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని వెళ్లి.. నువ్వు మోసం చేసి అగ్రిమెంట్ పేపర్ తీసుకున్నావని పోలీసులకి చెప్తానని అనగానే కనకం అగ్రిమెంట్ పేపర్ ఇస్తుంది. వెళ్లి నీ కూతురిని ఆఫీస్ కి రమ్మని చెప్పు అని అనామిక అంటుంది. నా కూతురు రాదు.. ఎలా రప్పిస్తావో చూపిస్తానని కనకం వెళ్లిపోతుంది...