English | Telugu
Naga Manikanta Remuneration: నాగ మణికంఠ రెమ్యునరేషన్ ఎంతంటే!
Updated : Oct 21, 2024
బిగ్ బాస్ ( bigg boss 8 telugu) హౌస్ లో కంటెంట్ స్టార్, సింపథీ స్టార్, పర్ స్పెక్టివ్ స్టార్ మణికంఠ నిన్న ఎలిమినేట్ అయి బయటకొచ్చేశాడు.
ఏడు వారాలు హౌస్ లో తనదైన శైలీలో ఎంటర్‌టైన్ చేసిన నాగ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యాడు. తనకి చెస్ట్ లో పెయిన్ వస్తుందని, గత రెండు వారాల నుండి ఆరోగ్యం బాలేదని, అసలు తనకి బాడీ సపోర్ట్ చేయట్లేదంటూ స్టేజ్ మీద నాగార్జునతో చెప్పేశాడు మణికంఠ. హౌస్ లోకి వచ్చిన మొదటి వారమే తనలోని ఎమోషన్స్ ని బయట పెట్టేశాడు మణికంఠ. తన భార్యాబిడ్డలు కావాలని, తన స్టెప్ ఫాదర్ దగ్గర రెస్పెక్ట్ కావాలని , తన పాప కావలంటూ ఎమోషనల్ అయిన మణికంఠ హౌస్ లోని ఆడాళ్ళందరిని ఏడ్పించేశాడు. ఇక హౌస్ లో ప్రతీ దాంట్లో యాక్టివ్ గా ఉండాలనుకున్న మణికంఠకి ఆరోగ్యం బాలేదని చెప్పాడు.
గత రెండు వారాలుగా బిగ్ బాస్(bigg boss 8 telugu) హౌస్ లో డల్ అయిపోయిన మణికంఠ.. ఆడియన్స్ ని ఓట్ వేయొద్దని రిక్వెస్ట్ చేశాడు. ఇక సెల్ఫ్ ఎలిమినేషన్ అయి బయటకొచ్చేశాడు. మణికంఠ రెమ్యునరేషన్ విషయానికొస్తే వారానికి లక్ష ఇరవై వేల(1.20లక్షలు) చొప్పున ఏడు వారాలకు గాను ఎనిమిది లక్షల నలభై వేలు తీసుకున్నట్లు తెలుస్తోంది.