English | Telugu

రోహిణి ఎవరిని నామినేట్ చేసిందంటే.. వరెస్ట్ కంటెస్టెంట్ గా విష్ణుప్రియ!

బిగ్ బాస్ సీజన్-8 లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో కొంతమంది రివెంజ్ నామినేషన్ చేయగా మరికొందరు సిల్లీ రీజన్స్ చెప్తూ నామినేట్ చేశారు.

బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ గురించి చెప్పాడు. ప్రతి ఇంటి సభ్యుడు ఈ ఇంట్లో ఉండటానికి అర్హత లేని ఇద్దరు సభ్యుల దిష్టి బొమ్మల మీద కుండలు పెట్టి కారణాలు చెప్పి వాటిని పగలగొట్టాల్సి ఉంటుంది.. మెగా చీఫ్ కారణంగా గౌతమ్‌ను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. గౌతమ్.. ఈ ఇంట్లో ఒక నామినేషన్ షీల్డ్ ఉంది.. ఆ నామినేషన్ షీల్డ్‌ని మీకు నచ్చినవారికి ఇవ్వండి.. అది ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ సభ్యుడిని ఈ వారం నామినేట్ చేసిన ప్రతిసారి రూ.50 వేల రూపాయలు విన్నర్స్ ప్రైజ్ మనీ నుంచి డిడక్ట్ అవుతాయంటు చెప్పాడు. ఇక విష్ణుప్రియ చెత్త రీజన్స్ చెప్పి ప్రేరణ, నిఖిల్ లని నామినేట్ చేసింది.

ఆ తర్వాత రోహిణి వచ్చింది. రోహిణి మొదటగా నిఖిల్‌ను నామినేట్ చేసింది. ఛార్జింగ్ టాస్కులో నువ్వు గౌతమ్‌పై ఫిజికల్ అయింది నాకు నచ్చలేదు.. గౌతమ్ కూడా చేశాడనుకో చీఫ్ అయిపోయాడు కాబట్టి బతికిపోయాడు.. సో అలా లాగడం, సోఫాపై విసిరేయడం నచ్చలేదు.. అలానే లైటర్ కోసం పాయింట్లు ఇచ్చేయడం కూడా ఓ రీజన్ అంటూ రోహిణి చెప్పింది. దీనికి నిఖిల్ డిఫెండ్ చేసుకున్నాడు. తర్వాత సెకెండ్ నామినేషన్ పృథ్వీకి వేసింది రోహిణి. నువ్వు టాస్కుల విషయానికొస్తే చాలా అగ్రెసివ్ అవుతున్నావ్.. సెల్ఫిష్‌గా ఆడతావ్.. నువ్వు చెప్పింది వినవ్.. టాస్కు, నామినేషన్ తప్ప విష్ణు పక్కన కాకుండా ఎక్కడా కనిపించలేదు.. నీ బిహేవియర్ నాకు నచ్చలేదు.. ఓన్లీ బాడీ ఉంటే చాలదంటూ రోహిణి పాయింట్లు చెప్పింది. ఇక్కడ రోహిణి అపోజిట్ టీమ్ కాబట్టి నిఖిల్ ని నామినేట్ చేసింది. కానీ సొంత క్లాన్ మెంబర్ అయినటువంటి నిఖిల్ ని విష్ణుప్రియ నామినేట్ చేసింది. అలాగే పృథ్వీ కోసం ప్రేరణని నామినేట్ ని చేసింది విష్ణుప్రియ.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.