English | Telugu

మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా ఎలా అనిపిస్తోంది నీకు

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో పండు డైలాగ్స్ మాములుగా లేవు. ఈ మధ్య డాన్సర్ పండు జబర్దస్త్ స్కిట్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఇక రాబోయే వారం షోలో వర్ష - పండు కలిసి స్కిట్ చేశారు. పండు స్టేజి మీదకు వర్షాతో పాడు తెగ సిగ్గుపడుతూ వచ్చాడు. "సర్ మేము మొగుడూపెళ్లాలం సర్" అన్నాడు శివాజితో. తర్వాత వర్ష వైపు చూస్తూ "మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా ఎలా అనిపిస్తోంది నీకు" అంటూ సిగ్గుమొగ్గలవుతూ అక్కడేదో వాళ్ళ మధ్య జరగకూడనిది జరిగిపోయినట్టు బిల్డప్ ఇచ్చి మరీ అడిగాడు. "పెద్ద ఏమీ అనిపించడం లేదు" అన్నాడు. ఇక జడ్జ్ శివాజీ ఐతే "పండు సూపర్ గా ఉంది కానీ" అని ఎంకరేజ్ చేసాడు. తర్వాత వర్షని హగ్ చేసుకున్నాడు పండు గట్టిగా. దాంతో వర్ష ఒక్కసారిగా షాకయ్యింది. "బాధపడకు" అంటూ ఓదార్చబోయాడు.

Brahmamudi : పడుతోంది ఓ బ్రహ్మముడి.. కలిపేనా ఆ ఇరువురిని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -542 లో....కనకం కృష్ణమూర్తిలు ఇద్దరు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటారు. ఆ తర్వాత రాజ్, కావ్య తినిపిస్తారు. అలా ఒక్కొక్కరు వెళ్లి కేక్ తినిపించి ఇద్దరిని విష్ చేస్తారు. మీకు పెళ్లి అయి ఇరవై అయిదు ఏళ్ళు గడిచింది. మాకు పెళ్లి అయి యాభై సంవత్సరాలు అవుతుంది. నా పెద్ద కొడుకు పెళ్లి అయి ముప్పై సంవత్సరాలు అవుతుంది. అబ్బాయి ఒక ఇంట్లో పుడతాడు అమ్మాయి ఒక ఇంట్లో పుడుతుంది ఆ ఇద్దరి కలిసి బ్రతకడం కోసం ఒకటి అయి ఒక దగ్గరుంటారని ఇందిరాదేవి అంటుంది.

సోషల్ మీడియాలో రచ్చ.. కమ్యూనిటీ ఓట్ల గురించి సీక్రెట్‌గా మాట్లాడుకున్న నబీల్, మెహబూబ్!

నిన్నటి ఎపిసోడ్ లో అర్థరాత్రి ముచ్చట్లలో నబీల్, మెహబూబ్ మాట్లాడుకున్న కొన్ని మాటలు వీడియోగా బయటకు వచ్చాయి. వీళ్ళిద్దరి మధ్య కమ్యూనిటీ గురించి టాపిక్ సాగడం ఇప్పుడు పెద్ద ఇష్యూ అయ్యింది. అసలేం జరిగిందంటే నిన్న రాత్రి మెహబూబ్, నబీల్ మాట్లాడుకున్నారు. మొదటగా నబీల్ హౌస్ లోకి వచ్చాక ఎలా ఉందో.. నామినేషన్ అంటే ఎలా భయపడ్డాడో చెప్తాడు. ఆ తర్వాత మొన్న నేను నీకు అవకాశం ఇచ్చినప్పుడు అందరు మనమిద్దరం ఒకటే కమ్యూనిటీ అని అనుకునే అవకాశం ఉంది కదా.. కానీ నేను అలా చేయలేదని నబీల్ అన్నాడు. దాంతో మెహబూబ్ అవును.‌...