English | Telugu

మణికంఠ ముంచేసింది వీళ్లనే.!


బిగ్ బాస్ సీజన్-8(bigg boss 8 telugu) లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కంటెంట్ ఇచ్చింది మణికంఠే. ఓసారి ఇంటలిజెన్స్ చూపిస్తాడు. మరోసారి కన్నింగ్, మరోసారి లవ్, మరోసారి సింపథీ.. ఇలా మల్టిపుల్ క్యారెక్టర్స్ ని ఒకేసారి చూపించే నాగ మణికంఠ(Naga Manikanta ) నిన్నటి ఆదివారం నాటి ఎపిసోడ్ లో ఎలిమినేషన్ అయి బయటకొచ్చేశాడు.

కొన్ని కటౌట్ లు చూస్తే చాలు.. వాళ్ళేంటో అర్థమవుతుంది కానీ ఎవరికి అర్థం కానీ క్యారెక్టర్ బిగ్ బాస్ సీజన్-8(bigg boss 8 telugu) లో ఎవరైనా ఉన్నారంటే అది నాగ మణికంఠే... హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక తనదైన శైలీలో ఆడుతూ వచ్చాడు మణికంఠ‌(Manikanta). బయట ఓటింగ్ కూడా చాలా గట్టిగానే ఉంది‌. అయితే ప్రతీవారం నామినేషన్ లో ఉన్న మణికంఠ అత్యధిక ఓటింగ్ తో టాప్ లో ఉండేవాడు. ఈ వారం కూడా అతను టాప్ లోనే ఉన్నాడు కానీ అతనికి ఆడాలని ఉన్నా, హెల్త్ సపోర్ట్ చేయకపోవడంతో ఉండలేనని చెప్పేసాడు మణికంఠ. ఇక ఏడో వారం నామినేషన్ లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ రాగా చివరగా నాగ మణికంఠ, గౌతమ్ మిగిలారు. ఇక ఎలిమినేషన్ ముందు నాగార్జున హౌస్ మేట్స్ ఒపీనియన్ తీసుకున్నాడు. అందరు మణికంఠ వెళ్తేనే బాగుంటుందని అన్నారు. అదే విషయం చెప్తూ మణికంఠని అడుగగా.. నేను బిగ్ బాస్ ( bigg boss 8 telugu) హౌస్ లో ఉండను సర్.‌. నా వల్ల అవ్వడం లేదంటు మణికంఠ చెప్పడంతో మణికంఠ ఈజ్ ఎలిమినేషన్ అని నాగార్జున చెప్పేశాడు. నిజానికి గౌతమ్ ఎలిమినేషన్ అవ్వాలి .. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం గౌతమ్ ఈజ్ ఎలిమినేటెట్ అని నాగార్జున చెప్పాడు. దాంతో గౌతమ్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు.

ఇక బిగ్ బాస్ (bigg boss 8 telugu) హౌస్ లోని హౌస్ మేట్స్ అందరికి బై బై చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చిన నాగ మణికంఠ తన ప్రాబ్లమ్ చెప్పుకున్నాడు. ఇక హౌస్ లో ఎవరుండాలి.. ఎవరు మారాలంటూ.. ఓ షిప్ తీసుకొచ్చి.. ఎవరిని ముంచేస్తావ్.. ఎవరని షిప్ ఎక్కిస్తావ్ అని అడిగాడు నాగార్జున. ఇక గౌతమ్, పృథ్వీ, నిఖిల్, టేస్టీ తేజని ముంచేశాడు మణికంఠ. విష్ణుప్రియ, హరితేజ, నయని పావని, నబీల్, అవినాష్, రోహిణి, మెహబూబ్ లని షిప్ మీద పెట్టాడు. ఇలా ఒక్కొక్కరి గురించి చెప్తూ మణికంఠ ఎమోషనల్ అయ్యాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.