English | Telugu

కావ్యతో నిఖిల్ బ్రేకప్.. బిగ్ బాస్ గేమ్‌లో ఏదో మిస్ అవుతోంది!

బిగ్ బాస్ సీజన్-8 లో నిఖిల్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్. అయితే ఈ మధ్య తన ఆట డల్ అయిందని ఎంతోమంది చెప్పారు. అదే విషయాన్ని తన మాజీ ప్రేమికురాలు కావ్యశ్రీ చెప్పుకొచ్చింది.

'గోరింటాకు' సీరియల్‌తో మొదలైన కావ్య-నిఖిల్ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్ల పాటు వీళ్లిద్దరు రిలేషన్ లో ఉన్నారు. ఎక్కడికెళ్లినా కలిసే వెళ్లేవాళ్లు.. షో నుంచి ఈవెంట్స్ వరకూ, పార్టీ నుంచి ఫంక్షన్ వరకూ ఎక్కడ చూసినా వీళ్లిద్దరూ జంటగానే కనిపించేవారు. ఇక వీళ్లు కలిసి చేసిన రీల్స్, యూట్యూబ్ ఛానల్‌లో వీడియోలు అయితే తెగ వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్‌కి కూడా బుల్లితెర బెస్ట్ పెయిర్స్‌లో వీళ్లు కూడా ఒకరు. అలాంటి ఈ జంట ఇటీవలే బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఈ విషయాన్ని నిఖిల్ స్వయంగా బిగ్‌బాస్ హౌస్‌లో కొంతమంది కంటెస్టెంట్లతో చెప్పాడు. అందుకే నిఖిల్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నా ఇప్పటివరకూ కనీసం ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు కావ్యశ్రీ.

అయితే తాజాగా నిఖిల్ బిగ్‌బాస్‌కి వెళ్లాక కావ్య ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయింది. మరి ఏం చెప్పిందో చూద్దాం. ఇటీవల స్టార్ మాలో ప్రసారమైన పరివార్ అవార్డ్స్ ఫంక్షన్‌కి కావ్యశ్రీ కూడా వచ్చింది. ఈ సందర్భంగా కావ్యను ఇంట్రెస్టింగ్ కొశ్చన్ అడిగింది అరియానా. "బిగ్‌బాస్ చూస్తున్నారా.. నిఖిల్ ఎలా ఆడుతున్నాడంటూ అరియానా అడుగగా.. చాలా బాగా ఆడుతున్నాడు.. నార్మల్‌గానే తను చాలా స్ట్రాంగ్.. బయట ఈవెంట్స్‌లో కూడా జరిగిన గేమ్స్, అన్నింట్లో తను ఎలా ఆడతాడో మనకు తెలుసు. కానీ కొంచెం ఎక్కడో ఏదో మిస్ అవుతుంది.. ఒక్కటి తక్కువ అయింది పుష్ప అనిపిస్తుంది.. తను తనలా లేడని నాకు అనిపిస్తుంది.. కొంచెం ఆ విషయం తెలుసుకుంటే బావుటుంది.. ఎందుకంటే తను ఏదైతే కాదో అలా బిహేవ్ చేస్తున్నాడు.. అది కరెక్ట్ చేసుకుంటే బావుంటుందంటూ కావ్య చెప్పుకొచ్చింది.

ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్.. నిఖిల్-కావ్య బ్రేకప్ మాట నిజమేనని ఫిక్స్ అయిపోయారు. అలానే వీళ్లిద్దరూ మళ్లీ కలవాలని కోరుకుంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. నిఖిల్ మనసులో కావ్య ఇప్పటికీ అలానే ఉందని.. వాళ్లిద్దరూ ఖచ్చితంగా మళ్లీ కలుస్తారంటూ ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు కొంతమంది నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం కావ్య మాట్లాడిన ఈ వీడియో సోనియా ఎలిమినేషన్‌కి ముందు షూట్ చేసిందంటూ చెబుతున్నారు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.