పాత కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన వైల్డ్ కార్డ్స్!
బిగ్ బాస్ సీజన్-8కి సంబంధించిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఆదివారం నాటి ఎపిసోడ్ రీలోడ్ పేరుతో ఏడు గంటలకే మొదలైంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా హరితేజ, నయని పావని, రోహిణి, గంగవ్వ, గౌతమ్, టేస్టీ తేజా, అవినాష్, మెహబూబ్ ఈ ఎనిమిది మంది ఎంట్రీ ఇచ్చారు. అయితే గత ఐదు వారాలుగా గేమ్‌ని గమనించి మరీ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఈ ఎనిమిది మంది పాత కంటెస్టెంట్స్‌కి చెమటలు పట్టిస్తున్నారు. మొదటి రోజు ఏం జరిగిందో చూసేద్దాం.