English | Telugu
Brahmamudi : ఆఫీస్ లో దొంగని కనిపెట్టిన కావ్య.. రాజ్ ఆ పాస్ వర్డ్ కనిపెట్టగలడా!
Updated : Oct 23, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -548 లో.....కావ్య సీఈఓ గా అప్పాయింట్మెంట్ అయిన లెటర్ రాజ్ కి ఇస్తుంది. అది చదివి రాజ్ షాక్ అవుతాడు. ఎందుకు తాతయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ కోప్పడతాడు. అప్పుడే కావ్యకి సీతారామయ్య ఫోన్ చేస్తాడు. వాడేం అంటున్నాడని అడుగుతాడు. రాజ్ కావ్యపై కోప్పడడం సీతారామయ్య వింటాడు. అప్పుడే శృతి మేడమ్ కి మీరు బొకే ఇవ్వండి అనగానే కోపంగా కింద పడేసి మా తాతయ్యతో తేల్చుకుంటానని వెళ్తాడు. విన్నారా తాతయ్య ఇప్పుడు మీ దగ్గరికే వస్తున్నాడని కావ్య ఫోన్ లో లైన్ లో ఉన్న సీతారామయ్యకి చెప్తుంది.
ఆ తర్వాత రాజ్ ఇంటికి వచ్చి.. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ కావ్య ని సీఈఓగా ఎందుకు చేశారంటు కోప్పడతాడు. అది విని రుద్రాణి, రాహుల్ లు షాక్ అవుతారు. నీకు ఆ సమర్ధత లేదని ఇలా చేసామంటు రాజ్ తిక్క కుదిరిలా సీతారామయ్య, ఇందిరాదేవి, అపర్ణలు మాట్లాడతారు. ఇది నా నిర్ణయం దీనికి ఎవరు అడ్డు చెప్పద్దని సీతారామయ్య అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ ఆటోలో ఇద్దరు అమ్మాయిలు ఎక్కుతారు. వాళ్లు కళ్యాణ్ పాడిన పాట గురించి మాట్లాడుకుంటారు. ఎవరు రాసారో గాని చాలా బాగుందనుకుంటారు. వాళ్ళు ఆటో దిగాక థాంక్స్ అని కళ్యాణ్ చెప్పగానే.. ఎందుకని వాళ్ళు అంటారు. పాట బాగుందన్నారని వాళ్లు అనగానే అదేదో నువ్వు పాడినట్లు అంటున్నావ్.. అలా రాయలంటే చాలా టాలెంట్ ఉండాలని వాళ్ళని వెళ్ళిపోతారు. ఇలా అందరు పాట బాగుందంటే చాలా హ్యాపీగా ఉందని అనుకుంటాడు.
ఆ తర్వాత అనామికతో ఆఫీస్ లో ఒక ఎంప్లాయి మాట్లాడుతుంటే.. కావ్య విని ఫోన్ తీసుకుంటుంది. అనామికకి వార్నింగ్ ఇస్తుంది. ఆ రోజు మేనేజర్ అంటూ నాకు ఇలాగే ఫోన్ చేసి నా భర్తకి నాకు గొడవలు వచ్చేలా చేసాడు.. ఇతన్నేం చెయ్యాలని కావ్య ఎంప్లాయిస్ తో చెప్తుంది. ఆ తర్వాత అతన్ని సెక్యూరిటీగా ఉండమని ఆర్డర్ వేస్తుంది. తరువాయి భాగంలో రాజ్ లాప్టాప్ ఓపెన్ చేస్తానని చూస్తే అది ఓపెన్ అవ్వదు. పాస్ వర్డ్ అడుగుతుంది. రాక్షసి పాస్ వర్డ్ కూడా మార్చేసిందని కావ్యకి రాజ్ ఫోన్ చేసి అడుగుతాడు. నేను చెప్పను మీరే కనుక్కోండని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.