English | Telugu

నిజంగానే గంగవ్వ ఏం అంటే అది జరుగుతుందా!

బిగ్ బాస్ హౌస్ లో మోస్ట్ క్రేజ్ కంటెస్టెంట్ ఎవరంటే ఠక్కున గంగవ్వ అనే చెప్తారు. ఎందుకంటే గంగవ్వకి పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేదు.. ఏదో మారుమూల ప్రాంతంలో ఉంటూ యూట్యూబ్ లో వీడియోలు చేస్తుండేది. తన మాట తీరుతో ప్రేక్షకులను సంపాదించుకుంది.

ఒక్కసారి కాదు ఏకంగా రెండుసార్లు బిగ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన యాసతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది గంగవ్వ. అయితే హౌస్ మొత్తం కూడా గంగవ్వకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. ఏదో ఒక సందర్భంలో గంగవ్వపై సీరియస్ అయిందట విష్ణుప్రియ. అదే విషయం మన టేస్టీతేజకి వినపడిందంట.. అది అతనికి చివుక్కుమనిపచిందని విష్ణుప్రియని నామినేట్ చేశాడు. దానికి విష్ణుప్రియ వివరణ ఇచ్చింది. మణికంఠని హౌస్ లో ఉంటావంటూ గంగవ్వ దీవించడం వల్లే మణికంఠ సేవ్ అవుతు వస్తున్నాడు. అలాగే మమ్మల్ని ఓడిపోతారు.. ఓడిపోతారని రెండు మూడు సార్లు అంటుంటే నాకు బాధ అనిపించింది.. నిజంగా గంగవ్వకి శక్తి ఉంది. అందుకే తను అంటే నిజంగా జరుగుతుందేమోననే భయంతో అలా అనకండి అవ్వ అని సీరియస్ అయ్యనని విష్ణు అంటుంది. ఆవిడపై అంత సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదనిపించిందని తేజ అన్నాడు.

ఆ తర్వాత విష్ణుని గంగవ్వ నామినేట్ చేస్తూ.. అదే విషయం చెప్పింది. ఆ రోజు నువ్వు నాపై కోపానికి వస్తే నా మనసు నొచ్చుకుందని గంగవ్వ అంటుంది. అయితే సారీ అవ్వ అని విష్ణు తనకి సారీ చెప్తుంది. హౌస్ లో అందరు కూడా గంగవ్వతో ప్రేమగా మాట్లాడతారు. తను ఎంత రూడ్ గా మాట్లాడిన లైట్ తీసుకొని మూవ్ అవుతుంటారు. మరి నిజంగానే గంగవ్వకి అంత శక్తి ఉందా.. అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...