English | Telugu

నేను పిచ్చిదాన్ని... నాకు మూడు లేదు పో..

బిగ్‌బాస్ సీజన్-8 లో ఎనిమిదవ వారం నామినేషన్స్‌లో నయని పావని కన్ఫ్యూస్ అయ్యింది. అసలు ఎవరో అంటే మరెవరో అనుకొని తను నామినేట్ చేసి పెద్ద కమెడీయన్ అయ్యింది నయని.

మొదటగా మెహబూబ్‌ను నయని పావని నామినేట్ చేసింది. ఛార్డింగ్ టాస్కులో క్లాన్‌గా ఆడదామని చెప్పి మీరు సెల్ఫిష్‌గా ఆడినట్లు అనిపించింది.. వాష్‌రూమ్‌కి ఎవరైనా రావాలంటే మాకు పాయింట్ ఇవ్వాల్సిందేనంటూ హరితేజను, నన్ను అక్కడ కూర్చోబెట్టారు.. కానీ లోపలికి వచ్చిన వాళ్ల దగ్గర మీరు పాయింట్లు తీసేసుకున్నారు.. అంటూ నయని అంది. దీనికి నిఖిల్‌ని నేను పాయింట్ అడగలేదు.. నువ్వు మణికంఠది పెట్టుకున్నావుగా అని నాకు ఇచ్చాడు.. నేను అవతలి క్లాన్ పాయింట్లు తగ్గాలని ఆడానంటూ మెహబూబ్ చెప్పాడు. దీనికి అవును మీరు సెల్ఫిష్‌గా ఆడారు.. నేను పిచ్చిదాన్ని క్లాన్ కోసం ఆడానంటూ నయని అంది. సెకండ్ నామినేషన్ నిఖిల్ అని చెప్పింది నయని. ఛార్డింగ్ టాస్కులో అమ్మాయిలంతా వాష్‌రూమ్‌కి వెళ్లకుండా, ఫుడ్ తినకుండా అంత ఓర్చుకుంటే.. మీరు లైటర్‌ కోసం పాయింట్ ఇచ్చేశారు.. అది నాకు నచ్చలేదు. అలానే మణికంఠ ఆపోజిట్ క్లాన్ కోసం ఆడుతున్నాడని మీరు అన్నారంటూ నయని అంది. దీనికి ఓయమ్మా.. ఆ మాట అన్నది నేను కాదు.. పృథ్వీ అంటూ నిఖిల్ చెప్పాడు. దీనికి పృథ్వీ కూడా అవును నేనే అన్నా అని ఒప్పుకున్నాడు. దీంతో అదే పృథ్వీది, మీది వాయిస్ ఒకేలా ఉంటుంది.. సారీ అంటూ నయని అంది. అదేంటి నేను అనని దానికి ఇప్పుడు నాకు వేస్తే ఎలా నామినేషన్ అంటూ నిఖిల్ అడిగాడు. అయితే లైటర్ పాయింట్ ఉంది కదా అంటూ నయని అంది. దీంతో ఎలాగో రెండు నామినేషన్స్ పడ్డాయ్.. మూడు పడితే ఫరక్ పడదని నాకు వేశావ్ వెయ్ అంటూ నిఖిల్ కామెడీగా అన్నాడు.

మూడు అని ఏదో అన్నావ్ ఏంటని నయని అనగా.. నాకు మూడు లేదు కుండ కొట్టేసి పో అని నిఖిల్ అనేసాడు. నయని పావని అసలు ఆ టాస్క్ లో ఆడిందే లేదు. ఎప్పుడు చూసిన నాకు పాయింట్ ఎవ్వరు ఇవ్వడం లేదంటూ ఏడ్వడమే. అందరు గేమ్ ఆడుతుంటే తన వారికి దూరంగా వచ్చేయడం, బోన్ టాస్క్ లో కూడా సరిగ్గా ఆడలేని నయని .. ఎవరేం ఆడుతున్నారో కూడా చూడకుండా నిఖిల్ ని నామినేట్ చేసింది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.