English | Telugu

Karthika Deepam2 : దీపకి కొత్త జీవితమిచ్చిన కార్తీక్.. ఇక కార్తీకదీపం సీరియల్ కి అన్నీ మంచి రోజులేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -179  లో.....నా కూతురిని నేను తీసుకొని వెళ్తానని దీప అనగానే.. శౌర్య హెల్త్ కండిషన్ ని దృష్టిలో పెట్టుకొని వద్దని కార్తీక్ అంటాడు. ఇక్కడ ఎవరి గురించి నేను ఆగలేను.. ఎవరి నిర్ణయాల గురించి అవసరం లేదని దీప అంటుంది. నీకు సిచువేషన్ తెలియదు.. చెప్పిన అర్ధం కాదు.. నా మాట వినండి అంటూ కార్తీక్ రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడే శౌర్య బయటకు వచ్చి.. అమ్మ అంటూ దీప దగ్గరికి వస్తుంది పదా వెళదాం ఊరికి.. బాయ్ చెప్పు అని దీప అనగానే.. నాకు కార్తీక్ కావాలి.. నాకు నాన్న కావాలని శౌర్య అంటుంది.

Eto Vellipoyindhi Manasu : భర్తకి ఏ ప్రాబ్లమ్ లేదు.. అత్త ప్లాన్ కనిపెట్టేసిన కోడలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -230 లో....అందరు టిఫిన్ చేస్తుంటారు. అప్పుడే రామలక్ష్మి వాళ్ళ అమ్మ సుజాత.. సీతాకాంత్ కి ఫోన్ చేస్తుంది. అల్లుడు గారు దసరా పండుగకి ఇంటికి రండీ అని చెప్తుంది. నాదేం లేదు రామలక్ష్మి ఇష్టమే.. నా ఇష్టమంటూ సీతాకాంత్ రామలక్ష్మికి ఫోన్ ఇస్తాడు. ఇద్దరు పండుగకి రండి అనగానే.. అమ్మా.. ఆయన చాలా బిజీ.. ఒకవేళ వీలైతే వస్తానని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి వెళదామంటే నాకు ఇష్టమే కదా ఎందుకు ఇలా నన్ను అడగలేదని సీతాకాంత్ అనుకుంటాడు.

Eto Vellipoyindhi Manasu : అటు ప్రేయసి, ఇటు కసాయి తల్లి కన్నింగ్ ..  

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -229 లో.... రామలక్ష్మి గురించి సీతాకాంత్ ఆలోచిస్తుంటే.. అప్పుడే నందిని వచ్చి రామలక్ష్మి గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. అవును రామలక్ష్మిని బయటకు తీసుకొని వెళ్ళావా.. సర్ ప్రైజ్ ఇచ్చావా.. తను హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది కదా అని నందిని అంటుంది. అవును నీ గురించి చెప్పు.. నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకున్నట్లే.. నువ్వు కూడా ఎవరినైనా చేసుకోమని సీతాకాంత్ అంటాడు. లేదు నేను ప్రేమించింది ఒక్కరినే అంతే.. వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే దానికి అర్ధం లేదని నందిని చెప్తుంది.