English | Telugu

గూస్ బంప్స్ తెప్పిస్తున్న ప్రేరణ నామినేషన్.. పృథ్వీ-విష్ణుప్రియ వరెస్ట్ బిహేవియర్!


బిగ్ బాస్ సీజన్-8 లో హౌస్ మేట్స్ అందరిలో ప్రేరణ నామినేషన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఎక్కడ చూసిన ప్రేరణ ఆర్గుమెంట్స్ నెక్స్ట్ లెవెల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

నిన్నటి నామినేషన్ లో ప్రేరణని నామినేట్ చేసిన పృథ్వీ.. తనకి టెంపర్ ఉందని కంట్రోల్ చేసుకోమన్నాడు. అది విని ప్రేరణతో పాటు హౌస్ మేట్స్ కూడా నవ్వుకున్నారు. అగ్రెసివ్ గా ఉండే పృథ్వీ తనని టెంపర్ ఉందని చెప్పడం కామెడీగా అనిపించింది. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో పృథ్వీని ప్రేరణ నామినేట్ చేసింది. విష్ణుప్రియ హౌస్ లో ఎందుకు ఉందో అర్థం కాదు.. పృథ్వీని కోసం ఆడుతూ వరెస్ట్ కంటెస్టెంట్ అనిపించుకుంటుంది. కిల్లర్ గర్ల్స్ టాస్క్ లో నేను బాధగా ఉన్నా కూడా నన్ను కన్సోల్ చేయడానికి రాలేదెందుకని విష్ణుప్రియని ప్రేరణ అడుగగా.. నేను బాధలో ఉన్నానని విష్ణుప్రియ అంది. నీకెందుకు బాధ..పృథ్వీని నామినేట్ చేశాననా అని ప్రేరణ అడుగగా... అవునని విష్ణుప్రియ అంది. ఇక టేస్టీ తేజ, మెహబూబ్ నామినేషన్ కూడా హైలైట్ గా నిలిచింది.

నువ్వు నెగెటివ్ ఎనర్జీ పాస్ చేస్తున్నానని అన్నారు. అది విని నాకు చివుక్కుమంది అని విష్ణుప్రియని టేస్టీ తేజ నామినేట్ చేశాడు. ఇక మెహబూబ్ తన నామినేషన్ గా నయని పావనిని నామినేట్ చేశాడు. నీ వల్ల క్లాన్ కి ఒక్క పాయింట్ కూడా రాలేదని నయని పావనిని మెహబూబ్ నామినేట్ చేశాడు. ఫ్లర్టింగ్, గొడవ తప్ప ఇంకేం లేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది ప్రేరణ. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో వరెస్ట్ బిహేవియర్ తో లీస్ట్ లో ఉన్న వారిలో పృథ్వీ-విష్ణుప్రియ ఉన్నారు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.