English | Telugu

Eto Vellipoyindhi Manasu : జ్యూస్ లో మత్తుమందు కలిపి ఇచ్చారు... ఇక తన మీద చెయ్యి వేసి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -233 లో.....ఫారెనర్స్ తో మీటింగ్ అవుతుంది. నందిని లాంటి ఫ్రెండ్ దొరకడం లక్కీ అందరి ముందు తనకి థాంక్స్ చెప్తున్నానని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత అందరు కలిసి భోజనం చేస్తారు. మరొకవైపు మాణిక్యం బాధపడుతుంటే.. అప్పుడే సుజాత వచ్చి కూతురు అల్లుడు వచ్చారు కదా ఎందుకు బాధపడుతున్నావని అడుగుతుంది.

ఆ తర్వాత రాక రాక వచ్చారు వాళ్లను ఏ లోటు లేకుండా చూసుకునే స్థోమత నాకు లేదని మాణిక్యం అంటాడు.ఆ తర్వాత తన మెడలో ఉన్న చైన్ ని మాణిక్యంకి ఇస్తుంది సుజాత. వద్దని మాణిక్యం అంటాడు. నువ్వు మారడమే నాకు పెద్ద ఆభరణమని సుజాత అంటుంది. మరొకవైపు శ్రీలత దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. నిద్ర లేపుతుంది. అక్కడ రామలక్ష్మి బావ గారిని తన పుట్టింటికి తీసుకొని వెళ్ళింది. మీరు అది పట్టించుకోకుండా ఎందుకిలా పడుకున్నారని అంటుంది. వాళ్లు ఒకటి అవ్వకుండా నందిని చూసుకుంటుందని శ్రీలత అంటుంది. మీలాగే తను కూడా అనుకొని.. ఏం చెయ్యకపోతే అంటు శ్రీలతని శ్రీవల్లి ఇర్రిటేట్ చేస్తుంది.

ఆ తర్వాత సీతాకాంత్ ని వెళ్లానివ్వకుండా ఫైల్ చూడమని నందిని చెప్తుంది. సరే అని సీతాకాంత్ ఫైల్ చూస్తుంటాడు. హారిక జ్యూస్ లో ఏదో కలిపి తీసుకొని వస్తుంది. అది తాగి సీతాకాంత్ మత్తుగా అవుతాడు. సరే వెళ్లు పడుకోమని సీతాకాంత్ ని నందిని తన గదిలో తీసుకొని వెళ్తుంది. మనం కాలేజీ డేస్ లో చాలా ఎంజాయ్ చేసామంటూ తనపై చెయ్ వెయ్యగానే సీతాకాంత్ చెయ్ తీసేసి.. రామలక్ష్మి వెయిట్ చేస్తుందంటూ వెళ్లిపోతాడు. దాంతో నందిని కోపంగా ఉంటుంది. మరొకవైపు సీతాకాంత్ కోసం రామలక్ష్మి వెయిట్ చేస్తుంది. ఆ తర్వాత అభికి నందిని ఫోన్ చేసి.. సీతా వెళ్తున్నాడు. రామలక్ష్మిపై డౌట్ వచ్చేలా చెయ్.. దాంతో రామలక్ష్మిని అసహ్యంచుకొని అక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్తుంది. దానికి అభి సరే అంటాడు. మరోవైపు సీతాకాంత్ కి రామలక్ష్మి ఫోన్ చేస్తుంది కానీ కలవదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...