English | Telugu

రోహిణిని బాడీ షేమింగ్ చేసిన పృథ్వీ!

బిగ్ బాస్ సీజన్-8 లో ఎనిమిదో వారం నామినేషన్ లో వ్యాలిడ్ రీజన్స్ చెప్పిన వారు తక్కువే కానీ వారు వేసిన నామినేషన్ పాయింట్లని సరిగ్గా డిఫెండ్ చేసుకున్నవారిలో ప్రేరణ బెస్ట్ . ఎందుకంటే పృథ్వీ వేసిన నామినేషన్ లో అసలు పాయింటే లేదు.

పృథ్వీ తన మొదటి నామినేషన్ గా ప్రేరణని చేశాడు. కిల్లర్ గర్ల్స్‌గా ఉన్నప్పుడు నువ్వు పర్సనల్‌గా తీసుకొని నన్ను నామినేట్ చేశావ్.. అలానే నీకు షార్ట్ టెంపర్ ఉందని ఒప్పుకున్నావ్.. అందుకే నామినేట్ చేస్తున్నానంటూ పృథ్వీ చెప్పాడు. టెంపర్ గురించి నువ్వు చెబుతున్నావా అంటూ ప్రేరణ నవ్వుకుంది. ఇక నామినేషన్ పాయింట్లో ఇద్దరూ సేమ్ అనిపించారు.. డిఫెన్స్ చూశాను.. నువ్వు వీక్ అనిపించి నామినేట్ చేశానంటూ ప్రేరణ చెప్పింది. అలా ఎలా చెప్తావంటూ పృథ్వీ అంటే నేనేమైనా కురిడీనా అంటూ కన్నడలో మాట్లాడింది ప్రేరణ. కురిడీనా అంటే గుడ్డిదాన్నా అని అర్థం. అయిన అగ్రెషన్ అయిన వ్యక్తి షార్ట్ టెంపర్‌కి నామినేట్ చేయడం వింతగా ఉందంటూ ప్రేరణ అంది. సెకెంఢ్ నామినేషన్ గా రోహిణిని చేశాడు పృథ్వీ . మీరు మనసు గెలిచేదే కాదు ఆట కూడా ఉండాలి.. మీరు ఆటలో వీక్‌గా ఉన్నారంటూ పృథ్వీ అన్నాడు. దీంతో ఏ టాస్కులో అంటూ రోహిణి అడిగితే.. బోన్ టాస్కులో.. మీరు వీక్ కాబట్టే లాస్ట్ వరకు ఉంచారు.. ఎఫెర్ట్ పెడుతున్నారు కానీ విన్ అవ్వడం లేదంటూ పృథ్వీ అన్నాడు. దీనికి నువ్వు ఒకసారైనా చీఫ్ అయ్యావా అంటూ రోహిణి అడిగింది. దీంతో మీరు గేమ్‌లో జీరో.. అలానే పని కూడా చేయడం లేదంటూ పృథ్వీ వాదించాడు. దీనికి నువ్వు నేనే కదా వాష్ రూమ్స్ క్లీన్ చేసిందని రోహిణి అంది. మీరు చేసింది అయితే నేను చూడలేదంటూ పృథ్వీ అన్నాడు.

నువ్వు అడ్డదిడ్డంగా వాదిస్తానంటే వాదించు.. నీ దగ్గర అసలు మేటర్‌యే ఉండదు.. మాట్లాడే మేటర్‌యే ఉండదు.. మంచిగా రెడీ అవుతావ్.. అద్దం ముందుకెళ్లి ఇలా ఇలా చూసుకుంటావ్.. కాఫీ తాగేసి కప్పు ఆమెకిచ్చేస్తావ్.. ఆమె కడిగేస్తది.. అంటూ రోహిణి రెచ్చగొట్టింది. దీనికి నేను ఆడుతున్నాను కాబట్టే ఎనిమిదవ వారానికి వచ్చానంటూ పృథ్వీ అన్నాడు. అదే ఎలా వచ్చావో నాకు తెలీడం లేదు.. ఎవరివల్లో నువ్వు ఉన్నావంతే.. ఏదో టాస్కుల్లో పరిగెట్టేశాను అంటే కాదంటూ రోహిణి అంది. దీనికి రన్నింగ్ కూడా ఉండాలి కదా.. అంత ఈజీ కాదు.. రన్నింగ్ అంటూ రోహిణిని పై నుంచి కిందకి చూశాడు పృథ్వీ. దీంతో ఏంటి ఆ లుక్కేంటి.. ఆ చూపేంటి.. ఆ చూడటమేంటి బాడీ షేమింగా.. నువ్వు చూసిన విధానం.. నాకు తెలుసు.. తొక్కలో నామినేషన్స్ చేయకంటూ రోహిణి ఫైర్ అయింది. ఇక కుండ పగలగొట్టేసిన తర్వాత కూడా రోహిణి తగ్గలేదు. ఆళ్లు.. ఇళ్లూ అన్నీ చేస్తే ఇంట్లో తినేసి కూర్చుంటాడు.. వెధవ లుక్కులు ఇస్తున్నాడు.. వెధవ లుక్కులు.. అంటూ తిట్టుకుంది రోహిణి. ఇలా మనిషిని కించపరిచేలా ఉన్న పృథ్వీ బిహేవియర్ ని వీకెండ్ లో నాగార్జున వచ్చి వార్నింగ్ ఇస్తాడని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.