English | Telugu
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షలకు హాజరు కాని వారందరిని పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాదు పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడి డిబార్ అయిన విద్యార్థులను కూడా పాసైనట్లు ప్రకటించింది.
విద్యార్థుల జీవితాలతో ఏపీ సర్కార్ చెలగాటమాడుతుందా? స్కూళ్లు నడపించడంపై అత్యుత్సాహం చూపిస్తోందా?. అంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది.
ఏపీలోని జగన్ ప్రభుత్వంపై హైకోర్టు ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ఎన్నికల కమిషనర్ కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఆస్ట్రియా దేశ రాజధాని వియన్నాలో కాల్పులు కలకలం రేపాయి. ఒకే సమయంలో ఆరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
సెంట్రల్ మాలీపై ఫ్రాన్స్ భీకరంగా విరుచుకుపడింది. ఉగ్రవాదుల స్థావరాలపై ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో 50 మంది వరకు అల్ ఖైదాకు చెందిన జీహాదీలు హతమయ్యారు.
తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం కావడం తీవ్ర దుమారం రేపింది.
ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. చర్చల మీద చర్చల తర్వాత రెండు రాష్ట్రాల మధ్య డీల్ కుదిరింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. అమెరికాలో మొత్తం దాదాపు 25.52 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి వుంది.
తెలంగాణలో ఎంతో ఉత్కంఠ రేపుతున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ కొద్దీ సేపటి క్రితం మొదలైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు మెల్లగా చేరుకుంటున్నారు.
కొన్ని నెలల క్రితం మాన్సస్ ట్రస్ట్ చైర్పర్సన్ గా సంచయిత బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఆమెను నిత్యం వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ట్రస్ట్ కింద ఉన్న భూముల దగ్గర నుండి ఎంఆర్ కాలేజీ వరకు అన్ని నిర్ణయాలు వివాదానికి దారి తీస్తున్నాయి.
ఇంటర్మీడియట్ ఆన్లైన్ అడ్మిషన్లపై జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇంటర్మీడియట్లో ఆన్లైన్ అడ్మిషన్లు చేయాలంటూ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది.
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఒక్కసారిగా షాకిచ్చారు. తాను రిటైరవుతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అందరూ అవాక్కయ్యేలా చేశారు. అయితే ఆమె పెట్టిన పోస్టును మొత్తం చదివితే అసలు ట్విస్ట్ తెలిసింది.
తెలుగు రాష్ట్రాల పాలనలో ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వంలోని కీలకమైన పోస్టుల్లో అధికారుల అనుభవం, పని తీరు కాకుండా తన అనుకున్న వారికే అందలం ఎక్కిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
తమిళనాట కొత్త రాజకీయ పార్టీపై సస్పెన్స్ కొనసాగిస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఏడాది క్రితం ప్రకటించిన రజనీకాంత్.. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా పార్టీ విషయం తేల్చలేదు.
ఏపీలో కరోనా ఉధృతి కొంత తగ్గినప్పటికీ ఇంకా ప్రతి రోజు వేలలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.