English | Telugu
వాళ్లతో జాగ్రత్త.. ట్రస్ట్ ఆస్తులు కొట్టేయగలరు.. రఘురామరాజు సంచలన కామెంట్స్
Updated : Nov 2, 2020
మరో పక్క "సంచయిత తల్లితో విడాకులు అయ్యాక ఆనంద గజపతి రాజు విజయనగరానికి చెందిన సుధా రాజును వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా ఆనంద గజపతి రాజు, సుధా రాజు లకు పుట్టిన అమ్మాయి ఊర్మిళా గజపతి రాజునే వారసురాలిగా ప్రకటిస్తూ వీలునామాలో ఆనంద గజపతి రాజు రాశారు. అయితే ఆనంద గజపతి రాజు చనిపోతే కనీసం చూడడానికి కూడా సంచయిత, ఆమె తల్లి రాలేదని.. అలా వారు పూర్తిగా ఆ కుటుంబానికి దూరం అయ్యారని అయన తెలిపారు. గత కొద్ది రోజులుగా వివాదాల నేపథ్యంలో ఊర్మిళ గజపతి రాజు టీవీలలో మాట్లాడుతూ... సంచయిత వివాదంపై కోర్టుకు వెళుతున్నట్టు తెలిపింది. అయినా సంచయిత ఇలా అకస్మాత్తుగా వచ్చి కలహాలు పెట్టడం సరికాదు. విజయనగర రాజా కుటుంబానికి చెందిన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో అవమానించే కుసంస్కారం రాజవంశీయులకైతే అసలు ఉండదు. ఎవరి అండో చూసుకుని సంచయిత చెలరేగిపోతే... రేపో మాపో కోర్టు ఆదేశాలు కూడా వస్తాయి. కాబట్టి అమ్మా సంచయితా.. నిన్ను అడ్డుపెట్టుకుని ఆస్తులను చేజిక్కించుకోవడానికి.. పంచ గ్రామాల్లోనే కాదు.. మాన్సస్ ట్రస్టుకు చెందిన ఆస్తులను కాజేయడానికి కొంత మంది చూస్తున్నారు. వారి ట్రాప్‌లో పడొద్దు. ట్రస్ట్ ఆస్తులు రక్షించుకోండి’’ అని రఘురామ రాజు హితవు పలికారు.