English | Telugu

జగన్ సర్కార్ కు హైకోర్టులో మరో ఎదురు దెబ్బ.. 

ఇంటర్మీడియట్ ఆన్‌లైన్ అడ్మిషన్లపై జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇంటర్మీడియట్‌లో ఆన్‌లైన్ అడ్మిషన్లు చేయాలంటూ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. రెండు సంవ‌త్స‌రాల ఇంట‌ర్మీడియ‌ట్ కోర్సులో వొకేష‌న‌ల్, జ‌న‌ర‌ల్ కోర్సుల‌లో ప్ర‌వేశాల‌కు ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తులు స్వీకరించింది. దీన్ని కొంత‌మంది హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. దీని పై విచార‌ణ సంద‌ర్భంగా ఏపీ విద్యాశాఖ‌పై హైకోర్టు ప్ర‌శ్నల వర్షం కురిపించింది. ఏ చ‌ట్టం, ఏ రూల్ ప్ర‌కారం ఈ అడ్మిషన్ల ప్ర‌క్రియ చేప‌ట్టార‌ని సూటిగా ప్ర‌శ్నించింది. విద్యార్థులు ఏ కాలేజీలో చేరాలనేది వారి ఇష్టానికి వదిలేయాలని.. అసలు ప్రభుత్వమే కాలేజీలను ఎలా కేటాయిస్తుందని పిటిషనర్లు వాదించారు. దీంతో 10 రోజుల పాటు జీవోను సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై త‌దుప‌రి విచార‌ణ‌ను న‌వంబ‌ర్ 9కు వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.