టీవీ తార రాగిణి ఎవరో మీకు తెలుసా?
'అమృతం' సీరియల్లో అంజి (గుండు హనుమంతరావు) భార్య శాంత పాత్రలో ఆడియెన్స్‌ను అమితంగా అలరించిన రాగిణి ఎవరో నేటి తరంలోని చాలామందికి తెలీదు. ఆమె మొదట 'వేమన' టీవీ సీరియల్ ద్వారా దూరదర్శన్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా లేడీ డిటెక్టివ్, అమృతం, నాన్న, రాధ మధు, ఇద్దరు అమ్మాయిలు, అగ్నిసాక్షి, రెండు రెళ్లు ఆరు లాంటి సీరియల్స్ ద్వారా వీక్షకులకు బాగా సన్నిహితమయ్యారు.