English | Telugu

అవినాశ్‌తో 'నేను మిస్టేక్ చేశా.. సారీ' అని చెప్పిన అరియానా!

'బిగ్ బాస్' హౌస్‌లో, హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అవినాష్, అరియనా మధ్య రిలేషన్షిప్ వార్తల్లో నిలిచింది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే మాటలూ వినిపించాయి. ఒకే ఫ్లాట్‌లో ఉంటున్నారని అప్పట్లో కొందరు చెవులు కొరుకున్నారు. అయితే, ఇద్ద‌రూ వాటిని ఖండించారు. తాము మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు. కానీ, అవినాష్ - అరియనా కొన్నాళ్లుగా చెట్టపట్టాలు వేసుకుని కనిపించలేదు. అందుకు కారణం ఇద్దరి మధ్య గొడవలే. అసలు, వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు? అనేది 'కామెడీ స్టార్స్'లో చెప్పుకొచ్చారు.

సండే టెలికాస్ట్ అయ్యే 'కామెడీ స్టార్స్'లో తన స్కిట్ లోకి అరియనాను తీసుకొచ్చాడు అవినాష్. ఆర్జీవీ-అరియనా బోల్డ్ ఇంటర్వ్యూ మీద అవినాష్ సెటైర్స్, పంచ్ డైలాగులు వేశాడు. స్కిట్ అయిపోయాక జడ్జ్‌మెంట్ టైమ్‌లో శ్రీముఖి ఇద్దరినీ నేరుగా అడిగింది. "కొన్ని గొడవల వల్ల మీ ఇద్దరి మధ్య దూరం వచ్చింది. ఎందుకు విడిపోయారు?" అని శ్రీముఖి అడిగింది.

"గొడవ అయిపోయాక ఇద్దరినీ కూర్చుని మాట్లాడితే మాకు గొడవ గురించి ఏమీ తెలియదు. గొడవ తర్వాత ప్రభావం ఏదైతే ఉంటుందో... 'మాట్లాడకూడదు, మాట్లాడొద్దు' అని. అది ఎక్కువ ప్రభావం చూపించింది" అని అరియనా చెప్పింది. "ఫ్రెండ్ తప్పుదోవలో వెళ్తుంది. ఇది రాంగ్ వే. ఆమెకు ఒక ఎక్స్‌పీరియన్స్. అలా వెళ్లొద్దు, వద్దని రెండు మూడుసార్లు చెప్పాను. రెండు మూడుసార్లు మాట్లాడడటం మానేశాను. అప్పుడు తనే వచ్చి 'నేను మిస్టేక్ చేశా. సారీ' అని చెప్పింది" అని అవినాష్ అన్నాడు. వెంటనే "ఆ పొగరుబోతు బిహేవియర్ తగ్గించుకోమని చెప్పండి" అని అరియనా అక్కడున్నవాళ్లకు చెప్పింది. "మనిషి అన్నాక కోపాలు, తాపాలు అన్నీ మైంటైన్ చెయ్యాలి. లేకపోతే మనిషే కాదు" అని అవినాష్ అన్నాడు.

మొత్తం మీద అవినాష్, అరియనా మధ్య రెండు మూడుసార్లు గొడవలు అయ్యాయని... ఆ తర్వాత మళ్ళీ కలిశారని అర్థమవుతోంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.