English | Telugu

బ్లాక్‌మెయిల్ చేసిన మోనిత‌ను కార్తీక్ పెళ్లి చేసుకుంటాడా?

'కార్తీకదీపం' సీరియల్ కథ కీలక ఘట్టానికి చేరుకుంది. కటకటాల నుండి కార్తీక్ బయటపడటానికి మోనిత ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఒక విధంగా అతడిని బ్లాక్ మెయిల్ చేసింది. భయపెట్టింది. మోనిత చర్యలకు కార్తీక్ తలొగ్గి ఆమెను పెళ్లి చేసుకుంటాడా? మోనిత షరతుకు అంగీకరించి జైలు నుండి బయటపడతాడా? అనేది రాబోయే ఎపిసోడ్స్‌లో తెలుస్తుంది. అసలు, ఇవాళ్టి ఎపిసోడ్ (ఆగస్ట్ 31, 1132)లో ఏం జరిగింది? కార్తీక్‌కు ఏం చెప్పి మోనిత బ్లాక్‌మెయిల్‌కి దిగింది, అతడిని భయపెట్టింది? అనే విషయాల్లోకి వెళితే...

టీలో మోనిత ఏదో కలపడం వల్ల కార్తీక్‌కు కడుపునొప్పి వస్తుంది. దాంతో ఏసీపీ రోషిణి అనుమతి తీసుకుని అతడిని ఆస్పత్రికి తీసుకువెళతారు. అక్కడ డాక్టర్ డ్రస్సులో మోనిత ఉంటుంది. కార్తీక్ గదికి వెళ్లి, అతడికి మత్తుమందు ఇస్తుంది. స్పృహ కోల్పోయిన తర్వాత చేతులను మంచానికి కట్టేస్తుంది. నోటికి ప్లాస్టర్ వేస్తుంది. తర్వాత నిద్ర లేపుతుంది. ఇదీ సోమవారం ఎపిసోడ్ లో జరిగింది. ఇక, మంగళవారం ఏమైందంటే?

కార్తీక్‌ను మంచానికి కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసిన మోనిత... 'నేను పోలీసులకు లొంగిపోతేనే నువ్వు బయటకు వస్తావ్. నేను లొంగిపోవాలంటే ఒక్క షరతు. అదేంటంటే... నీతో దీప ఉంటుంది. నేనూ ఉంటాను. మనమంతా కలిసే ఉందాం' అంటుంది. అంతకు మించి మరోదారి లేదని చెబుతుంది. పెళ్లి చేసుకోవడం వల్ల తనలాంటి అందగత్తె బోనస్ కింద దక్కుతుందని చెబుతుంది. తాను పోలీసులకు లొంగిపోతే రెండు మూడేళ్లు జైలుశిక్ష పడుతుందని, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని అంటుంది. 'నా బిడ్డ నిన్ను నాన్నా అని పిలవాలి. దీపను అడ్డు తొలగించాలని కూడా అనుకోను' అని ఆఫర్ ఇస్తుంది.

ఒకవేళ తన ప్రతిపాదనకు అంగీకరించకుండా ఏసీపీ రోషిణికి చెప్పాలని చూస్తే... తనను తానూ షూట్ చేసుకుని చ‌స్తానని బెదిరిస్తోంది. 'మీ అమ్మ రివాల్వర్ నుండి మిస్ అయిన బుల్లెట్ తో షూట్ చేసుకోవడం వల్ల నిన్ను అరెస్ట్ చేస్తారు. అప్పుడు శాశ్వతంగా జైల్లో ఉంటావ్' అని తన ప్లాన్ వివరిస్తుంది. కట్లు విప్పేసిన తర్వాత తనను పట్టుకోవాలని చూసినా... తన గురించి పోలీసులకు చెప్పినా... తల్లితండ్రుల్ని, దీపను చంపిస్తానని, ఆల్రెడీ వాళ్లకు స్పాట్ పెట్టానని కార్తీక్‌కు వార్నింగ్ ఇస్తుంది మోనిత. పిల్లల్ని కూడా వదలనని అంటుంది. కుటుంబం కోసం కార్తీక్ మౌనంగా ఉంటాడు. కట్లు విప్పేసి రేపు వస్తానని, అప్పుడు నిర్ణయం చెప్పమని మోనిత వెళుతుంది.

అప్పటికి భర్తకు ఏమైందోనని ఆందోళనగా ఆస్పత్రికి వచ్చి, రూమ్ బయట ఏడుస్తున్న దీపతో కూడా మోనిత మాట్లాడుతుంది. అయితే తనను గుర్తుపట్టని విధంగా డాక్టర్ డ్రస్సులో మాస్క్ ధరించి ఉంటుంది. దీపను పోలీసులు కార్తీక్ గదిలోకి అనుమతించకపోతే... వాళ్ళతో మాట్లాడి దీపను పంపే విధంగా ఏర్పాట్లు చేస్తుంది.

దీపను చూడగానే కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. కంగారు పడతాడు. భయపడుతూ ఉంటాడు. దాంతో దీపకు అనుమానం వస్తుంది. డాక్టర్ వేషంలో వచ్చింది మోనిత ఏమో అని దీప అనుకుంటూ ఉండగా నేటి ఎపిసోడ్ కి శుభం కార్డు వేశారు. అది నిజమా? క‌ఆదా? అనేది బుధవారం చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.