English | Telugu
మళ్ళీ 'మాయాద్వీపం' తీసుకొస్తున్న ఓంకార్
Updated : Aug 25, 2021
ఓంకార్ అంటే బుల్లితెర మీద ఒక బ్రాండ్. అందుకు కారణాలు ఏమిటని వెతికితే 'ఆట' డాన్స్ ప్రోగ్రామ్ సహా 'మాయాద్వీపం' రియాలిటీ షో కూడా ఉంటుంది. కెరీర్ స్టార్టింగులో ఓంకార్ చేసిన ఈ షో అతడికి మంచి సక్సెస్ ఇచ్చింది. వరుసగా మూడేళ్లు... 2007, 2008, 2009లో 'మాయాద్వీపం' చేశాడు. ఆ తర్వాత దానిని పక్కన పెట్టేశాడు. నాలుగేళ్ల తర్వాత 2013, 2014లో చేశాడు.
ఇప్పుడు మళ్ళీ కొత్తగా 2021లో 'మాయాద్వీపం' తీసుకురావడానికి ఓంకార్ ప్లాన్ చేశాడు. 'పిల్లలూ... మీరు 'మాయాద్వీపం'లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే?' అంటూ ఆల్రెడీ ఒక ప్రోమో రిలీజ్ చేశాడు. ఆరు నుండి పన్నెండు ఏళ్లలోపు వయసున్న పిల్లలు తమ టాలెంట్ చూపించే విధంగా ఒక నిమిషం వీడియో రికార్డ్ చేసి... దాంతో పాటు పేరు, వివరాలను పంపించమని అడిగాడు. త్వరలో జీతెలుగు ఛానల్ లో ఈ షో స్టార్ట్ కానుంది.
ఈసారి షోలో కొత్తగా ఏం ప్లాన్ చేశారో చూడాలి. మునుపటిలా పిల్లలను ఈ సరికొత్త 'మాయాద్వీపం' అలరిస్తుందా? లెటజ్ వెయిట్ అండ్ సీ.