English | Telugu
గాజుముక్క గుచ్చుకొని "అబ్బా" అని అరిచిన 'మూగమ్మాయి' మోనిత!
Updated : Aug 26, 2021
'కార్తీక దీపం' కథనం రసవత్తరంగా మారింది. ఎటువంటి నేరం చెయ్యని కార్తీక్ కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అతడు కటకటాల వెనక్కి వెళ్లడానికి కారణమైన మోనిత, అతడిని చూడటానికి మారు వేషంలో ఏకంగా జైలుకు వచ్చింది. అదే సమయంలో జైలుకు దీప రావడం, వాళ్ళిద్దరికీ మోనిత టీ ఇవ్వడం గత ఎపిసోడ్‌లో జరిగిన సన్నివేశాలు! మోనితను కార్తీక్, దీప దంపతులు గుర్తించారా? లేదా? అన్నది నేటి ఎపిసోడ్‌లో ఆసక్తికరంగా మారింది. అసలు, ఈరోజు (ఆగస్టు 26, 1128) ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే...
మోనిత పోలీస్ స్టేషన్‌కి రావడం, అక్కడున్న వాళ్ళకు టీ ఇవ్వడం తెలిసిందే. గుమ్మం దగ్గర ఉన్న మోనితను పక్కకు తప్పుకోమని దీప అడిగే సన్నివేశాన్ని ఈరోజు చూపించారు. భర్తకు భోజనం తీసుకుని వెళ్తున్న దీపను చూసి 'దీని పతి భక్తి తగలెయ్య' అని మోనిత తిట్టుకుంటుంది. కార్తీక్ దగ్గరకు వెళ్లిన దీప, మోనిత బతికున్న విషయాన్ని చెబుతుంది. తనను చంపడానికి వచ్చిన మోనితను వదలనని దీప అంటుంది. ఆమెను కార్తీక్ వారిస్తాడు. ఆ రోజు వీడియో తీసిన సమయంలో మోనిత నిన్ను చూస్తే పరిస్థితి ఏంటని మందలిస్తాడు. భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకునేది మోనిత వింటూ ఉంటుంది.
కార్తీక్ చేతికి మోనిత టీ ఇవ్వబోతే ముందు దీపకు ఇవ్వమని కార్తీక్ అంటాడు. దీప చేతికి ఇవ్వకుండా టేబుల్ మీద పెట్టబోయి కింద పడేస్తుంది. సౌండ్ విని 'ఏయ్ ఎవరు నువ్వు' అని ఓ కానిస్టేబుల్ అంటాడు. అక్కడ మోనితను కార్తీక్ సేవ్ చేశాడని చెప్పాలి. లేదంటే దొరికిపోయేది. 'తను మూగమ్మాయి. టీ కొట్టు అతని కూతురు. ఈ రోజు నుండి ఈమె టీ తెస్తుందని రత్నసీత చెప్పింది' అని కార్తీక్ చెప్పడంతో మోనిత సేవ్ అయ్యింది. అయితే, కిందపడిన టీ గ్లాసు గట్రా క్లీన్ చేసేటప్పుడు మోనిత 'అబ్బా' అని అరవడంతో కార్తీక్ మనసులో డౌట్ వస్తుంది. మూగమ్మాయి అరవడం ఏమిటి? అని ఆలోచిస్తాడు. అంతకు ముందు టీ అందించిన సమయంలో స్పర్శను గుర్తు చేసుకుని, అది మోనిత స్పర్శ అని పసిగడతాడు.
'రత్నసీత మూగమ్మాయి టీ తెస్తుందని చెప్పింది. కానీ, ఆమె గాజు ముక్క గుచ్చుకున్నప్పుడు అబ్బా అని అరిచింది. నువ్వు విన్నావా?' అని దీపను కార్తీక్ అడుగుతాడు. మీరేదో భ్రమలో ఉన్నారని దీప లైట్ తీసుకుంటుంది. దీపకు నిజం చెబితే మోనిత వెంటపడుతుంది. అప్పుడు దీపను మోనిత చంపేస్తుందని చెప్పడు. ఏసీపీ రోషిణి వచ్చాక చెప్పాలని అనుకుంటాడు. మరోవైపు మోనిత ఆస్పత్రికి ఏసీపీ రోషిణి వెళ్తుంది. అక్కడ డాక్టర్ భారతి, పనిచేసే వాళ్లు, అందరూ కార్తీక్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతారు.
మోనిత బతికే ఉందని దీప చెబితే కార్తీక్ నమ్మలేదు. ఇప్పుడు కార్తీక్ కి కూడా మోనిత బతికి ఉందని, జైలుకు వచ్చిందనే విషయం తెలిసింది. దాంతో తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.