English | Telugu
రాహుల్‌తో నటించడానికి ఒక్క పైసా తీసుకోని అషు! రియల్ ఫ్రెండ్‌షిప్పు!!
Updated : Aug 28, 2021
బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న రాహుల్ సిప్లిగంజ్, అషురెడ్డి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందనే ప్రచారం ఉన్నప్పటికీ, ఆ ఇద్దరూ మాత్రం తాము గుడ్ ఫ్రెండ్స్ అని మాత్రమే చెప్పుకుంటూ వస్తున్నారు. తమ ఫ్రెండ్‌షిప్‌ను మెచ్చుకున్న ఓ అభిమానికి థాంక్స్ చెబుతూ రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు రాహుల్. ఇటీవల రాహుల్, అషురెడ్డి "నువ్వెవరే" అనే ఒక మ్యూజిక్ సింగిల్‌లో కలిసి నటించారు. దానికి సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్‌ను ఆ అభిమాని షేర్ చేశాడు. దానికి "#Friendshipbonding' అనే హ్యాష్‌ట్యాగ్, ఒక హార్ట్ ఎమోజీని జోడించాడు.
అతడి పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన రాహుల్, "యస్ మిస్టర్ నాగరాజ్. మొత్తానికి నువ్వైనా గుర్తుపట్టినావ్ మాది ఫ్రెండ్‌షిప్ అని! నా ఫాలోయర్స్‌లో మీరే మొదటి వ్యక్తి. నేను, అషు కేవలం మా పని చేస్తున్నాం. అషు మూడు రోజుల పాటు నా వీడియోలో యాక్ట్ చేసి, ఒక్క పైసా కూడా తీసుకోలేదు. దాన్నే ఒక ఫ్రెండ్‌కు సపోర్ట్ చేయడానికి రియల్ ఫ్రెండ్ అంటారు" అని రాసుకొచ్చాడు.
రాహుల్ ఇన్‌స్టా స్టోరీని షేర్ చేసిన అషురెడ్డి "లవ్ యు రాహుల్ సిప్లిగంజ్" అని రిప్లై ఇచ్చింది. అదీ విషయం!