English | Telugu
స్కిట్‌లో కాదు.. ప్రేమతో హరికి అషు ముద్దు!
Updated : Aug 26, 2021
టీవీ కామెడీ షోల్లో ఈమధ్య కిస్సులు కామన్ అయ్యాయి. 'జబర్దస్త్'లో మొన్నటివరకు లేడీ గెటప్స్ తో స్కిట్లు చేసేవారు. ఎప్పుడైతే లేడీ గెటప్స్ వేసుకునే అబ్బాయిల ప్లేసులో అమ్మాయిలను తీసుకోవడం మొదలైందో... అప్పటి నుండి స్కిట్ ప్రాక్టీస్‌లో లేకపోయినా అమ్మాయిలను ఎత్తుకోవడం, తాకడం, కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం చేస్తున్నారు మేల్ కంటెస్టెంట్లు. అమ్మాయిలు కావాలని అబ్బాయిలకు ముద్దులు పెట్టడం కల అన్నట్టు ఉండేది. కానీ,అషురెడ్డి మాత్రం హరికి ప్రేమతో ముద్దు పెట్టింది.
'స్టార్ మా'లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చే 'కామెడీ స్టార్స్'లో హరి టీమ్ లో అషురెడ్డి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వాళ్ళు చేసే స్కిట్స్ కు హైలైట్ అవుతూ ఉంటుంది. ఈ సండే 'లవ్' థీమ్ మీద ఎపిసోడ్ చేశారు. '30 వెడ్స్ 21' జంట చైతన్య, అనన్యతో పాటు మై విలేజ్ షో అనిల్ తో పాటు అవినాష్, అరియనా సందడి చేశారు.
ప్రోగ్రామ్ మధ్యలో హరిని అషురెడ్డి ప్రేమతో ముద్దు పెట్టుకుంది. దానికి హరి కూడా షాక్ అయ్యాడు. షో చివర్లో అషురెడ్డి మీద ప్రేమ ఉన్నంత కాలం తన గుండెలపై అషు పేరు టాటూగా ఉంటుందని హరి చెప్పుకొచ్చాడు. సండే షోకి సత్యదేవ్ గెస్ట్ గా వచ్చాడు.