English | Telugu
బిచ్చగత్తెలా మారి రోడ్డున పోయేవాళ్లను ఇబ్బందిపెట్టిన వర్ష!
Updated : Aug 30, 2021
'జబర్దస్త్' షోలో, టీవీ ఈవెంట్లలో, సీరియళ్లలో వర్ష అందంగా కనిపిస్తుంది. ఆమెను అందాల బొమ్మగానే అందరూ చూపిస్తుంటారు. అటువంటి వర్ష బిచ్చగత్తెలా మారింది. రోడ్డున పోయేవాళ్లను చాలా ఇబ్బంది పెట్టింది. అబ్బాయిలకు అయితే ప్రపోజ్ చేసింది. అమ్మాయిలను అయితే "మీకు ఎవరైనా అన్నయ్యలు ఉన్నారా?" అని అడగటం మొదలుపెట్టింది. ఇదంతా ఒక ఈవెంట్ కోసమే!
పండగలకు ఈటీవీ స్పెషల్ ఈవెంట్లు చేస్తుంది. టీవీ ఆర్టిస్టుల చేత ప్రాంక్స్ చేయించడం కామన్. ఈసారి వినాయక చవితి సందర్భంగా ఈటీవీ కోసం మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ 'ఊరిలో వినాయకుడు' అని ఒక ఈవెంట్ చేసింది. అందులో వర్షకు ఎవరూ గుర్తుపట్టని విధంగా రోడ్డు మీదకు వెళ్లి అబ్బాయి యాక్సెప్ట్ చేసేలా ప్రపోజ్ చెయ్యాలని టాస్క్ ఇచ్చారు. అందుకోసం వర్ష బిచ్చగత్తెలా మారింది. వర్ష ప్రపోజల్ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారేమో అని చెడగొట్టడానికి ఇమ్మాన్యుయేల్ కూడా ఆమె వెంట వెళ్ళాడు.
'ఊరిలో వినాయకుడు' ఈవెంట్ కోసం ఆటో రామ్ ప్రసాద్, హైపర్ ఆది షాపింగ్ మాల్‌కి వెళ్లి అక్కడ ఎవరికి ఎక్కువ హగ్గులు వస్తాయో అని కాంపిటీషన్ పెట్టుకున్నారు. లడ్డువేలం పాటలో రోజా, ఇంద్రజ పోటీపడ్డారు. రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' టీమ్ కూడా 'ఊరిలో వినాయకుడు' ప్రోగ్రాంలో సందడి చేశారు.