English | Telugu
అతడి ఇమిటేషన్ చూసి శ్రీముఖికి చచ్చిపోవాలనిపించింది!
Updated : Aug 26, 2021
ఒకరు కాదు... ఇద్దరు కాదు... ఏకంగా ముగ్గురు యంగ్ హీరోలతో సండే సందడి చేయబోతోంది 'జీ తెలుగు' ఛానల్. కృష్ణాష్టమి సందర్భంగా జీ తెలుగులో 'అల... బృందావనంలో' అని సీరియల్ ఆరిస్టులు, టీవీ కమెడియన్లతో ఓ ప్రోగ్రామ్ చేసింది. యంగ్ హీరోలు సుశాంత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబులను దానికి గెస్టులుగా తీసుకొచ్చింది.
శ్రీముఖిని బుల్లెట్ ఎక్కించుకుని స్టేజి మీద సుశాంత్ ఒక రౌండ్ వేశాడు. అంటే... 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'లో ప్రమోషన్ అన్నమాట. 'రాజ రాజ చోర'లో దొంగగా నటించిన శ్రీవిష్ణు చిన్నతనంలో చేసిన దొంగతనాలను గుర్తు చేసుకున్నాడు. సుధీర్ బాబు ఏం చేశాడన్నది ఆసక్తికరం. ఆదివారం ఐదు గంటలకు ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ కానుంది. ఇక, ఇందులో శ్రీముఖిని గల్లీబోయ్ రియాజ్ ఇమిటేట్ చెయ్యడం ఇంట్రెస్టింగ్ గా ఉంది.
స్కిట్ లో భాగంగా బాలయ్య వేషధారి 'గాడిద' అని తిడితే... 'నేను చూసేదానికి గాడిదలా ఉంటాను కానీ' అని శ్రీముఖి గెటప్ వేసిన రియాజ్ డైలాగ్ చెప్పాడు. దాంతో ఒక్కసారి అందరూ నవ్వేశారు. శ్రీముఖి అయితే 'నన్ను ఎంతోమంది ఇమిటేట్ చేశార్రా! కానీ, ఫర్ ద ఫస్ట్ టైమ్ చచ్చిపోవాలని అనిపిస్తోంది' అని చెప్పింది.
'శ్రీముఖి... శ్రీముఖి... నువ్ అరుస్తావు దేనికి?
ఓడలా ఒళ్లు పెంచావ్.. తగ్గించవు దేనికి?' అంటూ శ్రీముఖి వెయిట్ మీద కూడా డైలాగులు వేశారు. ప్రోమోలో ఇన్ని ఉంటే... షోలో ఇంకెన్ని పంచ్ డైలాగులు, సెటైర్స్ ఉన్నాయో చూడాలి.