అక్షరం భయపడదు

అక్షరం భయపడదు

డా. సి.భవానీదేవి

నచ్చని భావాన్ని దాచుకోవటం
అక్షరానికి అలవాటులేదు
భావాల మధ్య ఘర్షణ కొత్తకాదు
ఇవ్వాళ మౌడ్యం కళ్ళెర్రజేస్తే తలొంచుతుందా ?

నిత్య సజీవం అక్షరాత్మకరకు గుండెల్ని కూడా
కరిగించగలననే నమ్మకం
తుటాల్ని గూడా త్రుటిలో
అధిగమించే వ్యక్తిత్వం

అక్షరం బెదరదు
ఆకాశమంత శక్తిని వెదజల్లే
ఎండుటాకులు విలవిల్లాడుతున్నాయి
నిర్భయంగా తలెత్తెన శిరస్సుకు వెలకట్టి
నిర్లజ్జగా ఎగిరిపడ్తున్నై

అక్షరం ఇప్పుడు జెండరై నిలదీస్తుంటే
దౌర్జన్యం ముసుగులో దాక్కుని ఓడింది వాడే !
ఓటమికి కూడా సిగ్గేసిందప్పుడే !