posted on Nov 12, 2013
పగటి తలపుల పుంత
-వి.బ్రహ్మానంద చారి
పగటి తలపుల పుంత
రేయంత గిలిగింత
రావె నా రాయంచ
కవన భుజ కీర్తులతో
స్వాగతమ్మిదె గొనుము
గగన తలమును వీడి
సుజల ధారల గ్రోలి
సుధను పంచగ రావె
ప్రణయమ్ములే లేని
హృదయమ్ములేలనె
కావ్యనాయికవీవె
రా.... జాబిలమ్మ