posted on Nov 9, 2013
అడ్డు గోడ కట్టినా
-డా.వై.రామకృష్ణారావు
అడ్డు గోడ కట్టినా
పక్కింటికి నీడ నిస్తోంది
చెట్టుకి
వైరం లేదు.
కవిత్వం రస్తాల్లో
బాటసారిని
సంగీతం కెరటాల్లో
'పాటసారి'ని.
అందమైన జ్వాల
చూసి
ఆనందించడానికే
ఆలింగానానికి కాదు.