posted on Nov 7, 2013
ముంగురుల పైన ముత్యం
డా.. వై. రామకృష్ణారావు.
ముంగురుల పైన ముత్యం
పెదవి పైన పగడం
ఉనికిని బట్టే
చినుకు.
స్మృతి కవిత్వంలోని
అక్షరాలు గాబోలు
అందుకే స్వరంలో
గాద్గాద్యం.
జారిపడిన
తియ్యని స్వప్నాన్ని
పైకి తోడుకుంటున్నా
కన్నీటి దారంతో....