posted on Nov 4, 2013
సన్నజాజి పూలు
- వి. బ్రహ్మానంద చారి
సన్నజాజి పూలు
సిగలోన తురుముకుని
సువాసనలతోటి
సాగిపోయే వేళ
సన్నుతీ గీతాల
సన్నాయి నొక్కులు
సరిచేసుకుని జూడ
సంగీతమేలనే
సందెపొద్దు కాడ
సాగె మబ్బుల నీడ
సంగతులు చెప్పవా
నా జాబిలమ్మ