posted on Oct 28, 2013
మెరుపు కొరడా
డా. వై. రామకృష్ణారావు
మెరుపు కొరడా దెబ్బలకేమో
కొండ
భోరున ఏడుస్తుంది
జలపాతంలో
ముందరి దృశ్యం కాదు
ముందు చూపు నేర్చుకో
పత్తి విత్తులో
మాన సంరక్షణ
స్వేద బిందువుల్ని
వెచ్చించి
ముత్యాల దండ కొనుక్కున్నది
కూలి తల్లి