కొత్తలిపి

కొత్తలిపి

- డా.సి.భవానీదేవి 

నా దినచర్యలో మరోపేజీ
అంతా కొత్త లిపి
ఆమూలాగ్రం ఎన్నిసార్లు చదివినా
ఆదరం కావటంలేదు
అక్షరాల పలకరింతకి
మూలాలు చిక్కటం లేదు

నాకోసం కలాన్ని తిరగరాసింది
నాచేతుల్లోని నవతగా నమ్మబలికింది
మర్నాడు సూర్యోదయానికి
పుస్తకంలో మరో ఖాళీపేజీ
కొత్త దస్తూరి కోసం ఎదురుచూస్తూ