పట్టు పావడ

పట్టు పావడపైన
బుట్ట చేతుల రైక
చుట్టెనే జరివోణి
గుట్టు దాచిన బోణి

ఎడమ బుగ్గన చుక్క
నుదుట లగ్గపు చుక్క
కనుల వెల్గుల సుక్క
కనికట్టు చేసెనే

తడబడే అడుగులా
అదిరేటి పెదవులా
బెదిరేటి చూపులా
నవ వధువుగా వచ్చె
నా....జాబిలమ్మ

 

వి. బ్రహ్మనందచారి