posted on Oct 22, 2013
జీలకర్ర బెల్లం
- వి.బ్రహ్మానంద చారి
జీలకర్ర బెల్లం
ఇరువురీ తలపైన
చలువమదినీ చేయ
చెలిమి చేరువ కాగ
కరము పట్టిన యంత
నరనరము పులకింత
తనువెల్ల హిమశృంగ
మయ్యెనో రాణమ్మ
దోసిటా ముత్యాలు
బాసటగ పదములు
చాటువుగ చెప్పనా
నా...జాబిలమ్మ