posted on Jul 2, 2013
గడియారం ముళ్ళు
డా.వై. రామకృష్ణారావు
గడియారం ముళ్ళు
అక్కడే తిరుగుతుంటై
నన్ను మాత్రం
పరుగులేత్తిస్తుంటై
కవిత్వాన్ని
రాస్తున్నానంది చెయ్యి
మరి, మనసు సంగతి
ఏమిటో !
మనిషి ప్రసవించేది
మనిషినే
చెట్టేమో
ఆకుల్ని,పూలనీ, పళ్ళననీ.